Hyderabad Traffic: రంజాన్ పర్వదినాన్ని 2024 ఏడాదిలో ఏప్రిల్ 11న జరుపుకోనున్నారు. ఏప్రిల్ 9న నెలవంక దర్శనం కావడంతో సౌదీలో ఏప్రిల్ 10న వేడుకలు నిర్వహించుకుంటున్నారు. భారత్ లో గురువారం వేడుకలు సాగనున్నాయి. రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలు ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఉదయం ప్రార్థనా స్థలాల వద్దకు వెళ్లి నమాజ్ చేయనున్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని ప్రజలు మసీదుల్లోకి వెళ్లి ప్రార్థనలు చేయనున్నారు.ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద ఉన్న మక్కా మసీదుతో పాటు పలు చోట్ల రంజాన్ ప్రార్థనలు చేయనున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అవి ఎలా ఉన్నాయంటే?
రంజాన్ పండుగ నేపథ్యంలో హైదరాబాద్ లోని పలుచోట్ల ట్రాపిక్ ఆంక్షలు విధించినట్లు కమిషనర్ కొత్తకొండ శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని మాసాబ్ ట్యాంక్, పురానాపూల్, కామాటిపురా, కిషన్ బాగ్ చుట్టుపక్కల ప్రాంతా్లో ట్రాఫిక్ ను మళ్లింపు చేశామన్నారు. ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయి. ట్రాఫిక్ ఆంక్షలపై వాహనదారులు సహకరించాలని ఆయన కోరారు. ట్రాఫిక్ మళ్లింపు ఎలా ఉంటుందంటే?
కిషన్ బాగ్, పునారాపూల్, కామాటిపూరా నుంచి ఈద్గా వైపు వచ్చే వాహనాలను బహదూర్ పురా క్రాస్ రోడ్ వద్ద దారి మళ్లిస్తారు. పురానాపూల్ నుంచి బహదూర్ పురా వైపునకు వెళ్లే బస్సులను జియాగూడ వైపునకు మళ్లిస్తారు. అయితే ఈద్గాలో ప్రార్థనలు చేయాలనుకునేవారు తమ వాహనాలను జూ పార్క్ ఓపెన్ ప్లేసులో పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. శివరాంపల్లి, దానమ్మ మాట్స్ వైపు వచ్చే వాహనాలను మోడరన్ సా మిల్, మీరాలాం ఫిల్టర్ బెడ్, సూపీ కార్స్ దగ్గర ఏర్పాటు చేశారు.
కాలాపత్తర్ నుంచి వచ్చే వాహనాలను మోచీ కాలనీ, బహదూర్ పురా, శంసీర్ గంజ్, నవాబ్ సాహెబ్ కుంట వైపు దారి మళ్లిస్తారు. ప్రార్థనల కోసం వచ్చేవారు భయ్యా పార్కింగ్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో పార్కింగ్ ఏర్పాటు చేశారు. మాసాబ్ ట్యాంక్ ఫ్లై ఓవర్ కింది నుంచి వాహనాలను అనుమతించబోమని పోలీస్ కమిషనర్ కొత్తకొండ శ్రీనివాస్ తెలిపారు. ఆయా అవసరాల కోసం వచ్చే ప్రజలు ట్రాఫిక్ మళ్లింపు గురించి తెలుసుకోవాలని సూచించారు.