https://oktelugu.com/

Nagula Panchami : నాగుల పంచమి రోజు ఇంట్లో పూజ ఎలా చేయాలి? ఎలాంటి నియమాలు పాటించాలి?

ఈ ఏడాది నాగుల పంచమి ఆగస్టు 9న జరుపుకుంటున్నారు. శుక్ల పక్ష పంచమి రోజున నాగుల పంచమి వస్తుండడతో ఈరోజును ప్రత్యేకంగా భావిస్తారు. వేద పంచాంగం ప్రకారం ఆగస్టు 8వ తేదా గురువారం మధ్యాహ్నం ప్రారంభమై ఆగస్టు 10వ తేదీ శనివారం ఉదయం 3.14 వరకు పంచమి తిథి ఉండనుంది. అయితే ఈరోజు ఉదయం 6.01 నుంచి 8.37 వరకు శుభముహూర్తం ఉండనుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : August 9, 2024 / 08:41 AM IST
    Follow us on

    Nagula Panchami : శ్రావణమాసం ను ఆధ్యాత్మిక మాసం అని కూడా అనవచ్చు. ఎందుకంటే ఈ నెల మొత్తం పూజలు, వ్రతాలతో గడుస్తుంది. అలాగే దాదాపు మూడు నెలల విరామం తరువాత పండుగల సీజన్ ప్రారంభం అవుతుంది. ఈనెలలోనే నాగుల పంచమి, రాఖీ పౌర్ణమి, వరలక్ష్మీ వ్రతం పర్వదినాలు రానున్నాయి. ఈ మూడు రోజుల్లో భక్తులు విశేష పూజలు చేయనున్నారు. వీటిలో ముందుగా వచ్చేది నాగుల పంచమి. నాగుల పంచమి ని ఎక్కువగా మహిళలు నిర్వహించుకుంటారు. సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని శుభ్రం చేసుకున్న తరువాత నాగేంద్రస్వామిని దర్శించుకోవడానికి వెళ్తారు. సమీపంలోని పుట్ట వద్దకు వెళ్లి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. పుట్టను పసుపు, పూలతో అలంకరిస్తారు. కొందరు శివాలయాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకొని, అనంతరం నాగ విగ్రహం ఉంటే పాలతో అభిషేకం చేస్తారు. సంతానం కోరుకునేవారు, జాతకం దోషం కలిగిన వారికి నాగేంద్ర స్వామి ఆశీస్సులు ఉంటే అన్నీ శుభాలే జరుగుతాయని అంటారు. అందువల్ల కొందరు మగవారు సైతం ఈరోజు పుట్ట వద్దకు వెళ్లి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. పుట్ట వద్దకు వెళ్లిన తరువాత ఇంటికి వచ్చి ఉపవాసం కూడా ఉంటారు. ఈరోజు నిష్టతో ఉండి ఉపవాసం చేయడం వల్ల నాగేంద్ర స్వామి కరుణ సాధిస్తారని కొందరు ఆధ్యాత్మిక వాదులు చెబుతూ ఉంటారు. అయితే నాగుల పంచమి రోజు ఎటువంటి పూజలు చేయాలి? ఏ సమయంలో చేయడం వల్ల ఫలితాలు ఉంటాయి? ఏయే పనులు చేయకూడదు? ఆ వివరాల్లోకి వెళితే..

    ఈ ఏడాది నాగుల పంచమి ఆగస్టు 9న జరుపుకుంటున్నారు. శుక్ల పక్ష పంచమి రోజున నాగుల పంచమి వస్తుండడతో ఈరోజును ప్రత్యేకంగా భావిస్తారు. వేద పంచాంగం ప్రకారం ఆగస్టు 8వ తేదా గురువారం మధ్యాహ్నం ప్రారంభమై ఆగస్టు 10వ తేదీ శనివారం ఉదయం 3.14 వరకు పంచమి తిథి ఉండనుంది. అయితే ఈరోజు ఉదయం 6.01 నుంచి 8.37 వరకు శుభముహూర్తం ఉండనుంది. ఈ వేళ్లో పూజలు చేయడం మంచిదని కొందరు ఆధ్యాత్మిక వాదులు పేర్కొంటున్నారు. ఈరోజు నాగదేవత జన్మించిన రోజుగా భావించి ఇంట్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు.

    నాగంచమి సందర్భంగా సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. నాగదేవతకు నిష్టంగా ఉండి పూజ చేస్తేనే ఫలితం ఉంటుంది. ఇదే సమయంలో శివుడిని ఆరాధించడం మరిచిపోవద్దు. పూజా విధానంలో భాగంగా ఎర్రని వస్త్రంను కింద పరిచి నాగదేవత చిత్రాన్ని దానిపై ఉంచాలి. అనంతరం పసుపు కలిపిన అక్షింతలు తిలకంగా తయారు చేసుకోవాలి. ఆ తరువాత దీపారాధర చేసి నాగదేవత విగ్రహానికి పాలాభిషేకం చేయాలి. పంచదార, పాలను నైవేద్యంగా సమర్పించాలి.

    కాల సర్పదోషం, జాతక దోషం ఉన్న వారు నాగ దేవతకు పూజలు చేయడం వల్ల ఫలితాలు ఉంటాయని కొందరు ఆధ్యాత్మిక వాదులు చెబుతున్నారు. అందువల్ల ఉపవాసంతో ఉండి నాగదేవతను ఆరాధిస్తూ ఉండాలి. నాగదేవతతో పాటు కాళీయుడు, తక్షకుడు, మణిభద్రకుడు, ధనుంజడి వంటి వారిని స్మరిస్తూ ఉండాలి. రాహు, కేతు ప్రభావం ఉన్న వారు సైతం ఈరోజు నాగదేవతను నమ్ముకున్న వారికి ఫలితాలు ఉంటాయని అంటున్నారు.

    నాగుల పంచమి రోజున కొన్ని పనులు అస్సలు చేయకుండా ఉండాలి. ఈరోజు ఇనుప వస్తువులతో చేసే పనులకు దూరంగా ఉండాలి. నేలపై ఎక్కడా తవ్వకుండా ఉండాలి. చెట్లను నరికివేయద్దు. కుట్టు, అల్లికలకు చేయకుండా ఉండాలి. సాయంత్రం సమయంలో పాముల పేర్లు కలకకూడదని అంటున్నారు. ఎక్కడైనా పాములు కనిపిస్తే వాటిని వదిలేయడం మంచిది. వాటిని చంపడం చేయొద్దు. లేకుంటే కుటంబం ఏళ్లపాటు సమస్యలు ఎదుర్కొంటుంది.