https://oktelugu.com/

Devotional : హుండీలో డబ్బులు వేస్తున్నారా..? ఎన్ని రూపాయలు వేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందో తెలుసా?

అందరం ఆలయాలకు వెళ్తుంటాం. దేవుడిని దర్శనం చేసుకుంటాం. తర్వాత పూజలు చేసి కోరికలు కోరుకుంటా. వచ్చేటప్పుడు అక్కడ హుండీలో డబ్బులు వేస్తాం. ఉన్నంతలో కొంత.. హుండీలో వేస్తుంటారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 11, 2024 / 11:11 AM IST

    Hundi In Temples

    Follow us on

    Devotional :  హిందూ దేవాలయాల్లో సాధారణంగా హిందువులతా వెళ్తుంటారు. ఆలయంలోకి అడుగె పెట్టగానే మానసింగా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. దేవుడిని దర్శించుకున్న తర్వాత ఒక్క నిమిషం కూర్చొని ధాన్యం చేస్తే టెన్షన్‌ ఫ్రీగా అనిపిస్తుంది. ఏదో తెలియని వైబ్రేషన్స్‌ మనలో కలుగుతాయి. శక్తి వస్తుంది. అయితే ఆలయంలో దేవుడి దర్శనం అనంతరం భక్తులు హుండీలో డబ్బులు వేస్తూ కనిపిస్తారు. తమ కోరిక తీరాలని ఇలా డబ్బులు వేస్తుంటారు. డబ్బులు వేసి భగవంతునికి కోరిక చెప్పుకుంటారు. నెరవేరాలని ప్రార్థిస్తారు. అయితే ఆలయాల్లో హుండీలో డబ్బులు వేసేప్పుడు ఎంత వేయాలి అనే దానికి కూడా లెక్క ఉంది. శాస్త్ర ప్రకారం ఎంత వేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందో కూడా పండితులు తెలియజేశారు. తిరుమల లాంటి ఆలయాల్లో అయితే నిలువు దోపిడీ కూడా ఇచ్చేస్తుంటారు. ఇక కొన్ని ఆలయాల్లో బంగారం(బెల్లం) మొక్కుగా చెల్లించుకుంటారు. అయితే పండితులు తెలిపిన వివరాల ప్రకారం హుండీలో ఎంత డబ్బులు వేస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం.

    – తిరుమల కొండలు ఏడు.. సప్త రుషులు ఉన్నారు. ఈ నేపథ్యంలో హుండీలో రూ.7 వేస్తే.. అనేక రోగనాశనం అని పండితులు తెలిపారు.

    – నవ రాత్రులు సంఖ్య తొమ్మిది. శత్రు బాధలు, శని బాధలు దూరం కావాలంటే హుండీలో 9 రూపాయలు వేయాలని పేర్కొంటున్నారు.

    – 11 సంఖ్య చంద్రుడికి అనుకూలమైన సంఖ్య. 11 రూపాయలను హుండీలో వేస్తే మానసిక సమస్యలు దూరం అవుతాయి.

    – కాళికాదేవి సిద్ధి సంఖ్య 12. ఈ నేపథ్యంలో 12 రూపాయలు హుండీలో వేస్తే కుటుంబ రక్షణ, ఎదుగుదల ఉంటుంది.

    – మహాగణపతి అనుగ్రహ సంఖ్య 21. ఈ నేపథ్యంలో హుండీలో 21 రూపాయలు వేస్తే దురదృష్టం పోతుంది. అదృష్టం వస్తుంది.

    – ఇక గురు అనుగ్రహ సంఖ్య 54. అందుకే హుండీలో 54 రూపాయలు వేస్తే విజయం ప్రాప్తిస్తుంది. ధన లాభం కలుగుతుంది.

    – కల్పవృక్ష ఆధార సంఖ్య 101. దీని ఆధారంగా హుండీలో 101 రూపాయలు వేస్తే జాతక దోషాలు పోతాయి. కోరికలు ఫలిస్తాయి.

    – శ్రీచక్ర మూల సంఖ్య, విశ్వం మూల సంఖ్య 108. సకల కోరికల సిద్ధి కలుగుతుంది. అందుకే 108 రూపాయలు హుండీలో వేస్తే మంచింది.

    – ఆశీర్వాద మూల సంఖ్య 116. దీని ఆధారంగా హుండీలో 116 రూపాయలు వేస్తే పుణ్యప్రాప్తి కలుగుతుంది. సప్త జన్మల పాపం తొలగిపోతుంది.