https://oktelugu.com/

Horoscope Vyshaka Masam: వైశాఖ మాసంలో ఈ రాశుల వారికి శుభయోగం..

2024 సంవత్సరంలో ఏప్రిల్ 24 నుంచి వైశాఖ మాసం మొదలైంది. ఈ మాసంలో మేష రాశి వారికి అనుకూల ప్రయోజనాలు ఉండనున్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : April 26, 2024 / 03:19 PM IST

    vyshaka masam horoscope

    Follow us on

    Horoscope Vyshaka Masam:వసంత రుతువలో వచ్చే రెండో మాసం వైశాఖ మాసం. ఈ నెల లక్ష్మీనారాయణుడికి ఎంతో ఇష్టమైనది. వైశాఖ మాసంలో వివిధ వ్రతాలు నిర్వహిస్తారు. ఈ నెలలో సూర్యుడు మేష రాశిలో కొనసాగుతాడు. దీంతో విశేష దానాలకు ఇది ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. వైశాఖ మాసంలో తులసి దళాలతో నారాయణుడిని కొలవడం వల్ల కొన్ని కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని చెబుతున్నారు. ఈ నెలలో సూర్యోదయానికి ముందే స్నానం చేస్తారో వారికి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ మాసంలో కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు ఉండనున్నాయి.

    2024 సంవత్సరంలో ఏప్రిల్ 24 నుంచి వైశాఖ మాసం మొదలైంది. ఈ మాసంలో మేష రాశి వారికి అనుకూల ప్రయోజనాలు ఉండనున్నాయి. ఉద్యోగులకు ఆదాయం పెరగుతుంది. కొందరికి పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు వస్తాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి.

    కర్కాటక రాశి వారి జీవితంలో అనూహ్య మార్పులు ఉంటాయి. భవిష్యత్ కు సంబంధించిన ప్రణాళికలు వేస్తారు. ఉద్యోగులు ఉల్లాసంగా విధులు నిర్వహిస్తారు. ఇంతకాలం అనుకుంటున్న పదోన్నతులు లభిస్తాయి. ఆదాయం ఎక్కువగా వస్తుంది. కొందరికి ఊహించిన విధంగా అదృష్టం కలుగుతుంది.

    మీన రాశి వారికి వైశాఖ మాసం ప్రీతిగా మారనుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారి ప్రయత్నాలు సక్సెస్ అవుతయి. విహార యాత్రలకు వెల్తారు. భవిష్యత్ కోసం కొత్త పెట్టుబడులు పెడుతారు. గతంలో చేసిన అప్పుల నుంచి విముక్తి పొందుతారు. సమాజంలో గౌరవ పెరుగుతుంది.