Horoscope Today : 2024 ఫిబ్రవరి 1న ద్వాదశ రాశులపై ఛిత్రా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ కారణంగా ఓ రాశి వారికి స్నేహితులతో ఇబ్బందులు ఎదురవుతాయి. మరో రాశివారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ నేపథ్యంలో గురువారం మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయాల్లో కలిసి వస్తుంది. ఉన్నతాధికారుల మద్దతు ఉంటుంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు లాభిస్తాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.
వృషభం:
గతంలో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అయితే కొత్త పనుల వల్ల పనిభారం పెరుగుతుది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
మిథునం:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. భూమికి సంబంధించిన వివాదాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మద్దతు పెరుగుతుంది.
కర్కాటకం:
ఇతరులతో ఎక్కువగా వాదనలు చేయొద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శత్రువుల మీపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
సింహ:
ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. కుటుంబ సభ్యులతో ఎక్కువగా వాదనలకు దిగొద్దు. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఉంటాయి.
కన్య:
వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు తోటివారి సహకారం ఉంటుంది. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. మీ ఇబ్బందులను స్నేహితులు అర్థం చేసుకుంటారు.
తుల:
ఆర్థిక పరమైన ప్రయోజనాలు ఉంటాయి. పెద్దల సాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునేవారికి మంచి సమయం.
వృశ్చికం:
ఆరోగ్యం విషయంలో వైద్యుడిని సంప్రదించాలి. ఓ సమాచారం నిరాశను కలిగిస్తుంది. కొన్ని విషయాలు ఇబ్బంది పెడుతాయి. ప్రియమైన వారితో విభేదాలు వస్తాయి.
ధనస్సు:
మనసులో ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో తొందరపాటు ఉండొద్దు. అన్ని పనులను ధైర్యంగా చేసుకోగలుగుతారు.
మకర:
కొన్ని ముఖ్యమైన పనుల కోసం ప్రయత్నిస్తారు. అవి సక్సెస్ అవుతాయి. జీవిత భాగస్వామి సహకారంతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారస్తులకు ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువ.
కుంభం:
గతంలో ఉన్న సమస్యలు నేటితో పరిష్కారం అవుతాయి. విభేదాలు తొలగిపోయి ఆనందంగా గడుపుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
మీనం:
స్నేహితులతో ఇబ్బందులు ఉంటాయి. వారికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. ఇంట్లో వారి సహకారం ఉండకపోవచ్చు. వ్యాపారులకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయి.