Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 మార్చి 4 న ద్వాదశ రాశులపై జ్యేష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. సోమవారం చంద్రుడు ధనస్సు రాశిలో సంచరించనున్నాడు. దీంతో మేష రాశివారిని కొందరు మోసం చేసే అవకాశం ఉంది. అలాగే మిగతా రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఫైనాన్స్ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో ఎక్కువగా వాదనలు చేయొద్దు. ఆరోగ్యం విషయంలో జగ్రత్త. కొందరు వ్యక్తులు మోసం చేసే అవకాశం ఉంది.
వృషభ రాశి:
ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు తోటి వారితో స్నేహపూర్వకంగా ఉండాలి. వ్యాపారులు కొత్త పెట్టుబడుల విషయంలో ఇతరుల సలహాలు తీసుకోవాలి.
మిధునం:
ఇతరులతో ఎక్కువగా వాదనలకు దిగొద్దు. వ్యాపారులకు ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఇతరుల నుంచి రుణం తీసుకుంటే దానిని వెంటనే చెల్లిస్తారు.
కర్కాటకం:
కొన్ని పనులతో బిజీ వాతావరణంలో ఉంటారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్యం ఉంటుంది. ముఖ్యమైన పనుల కోసం విహార యాత్రలకు వెళ్తారు.
సింహ:
ఈ రాశివారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అయినా కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం బాగుంటుంది.
కన్య:
ఆర్థిక రంగాల్లో పనిచేసేవారికి అనుకూలమైన వాతావరణం. ఉద్యోగులు కొన్ని చిక్కులు ఎదుర్కొంటారు. అయితే కష్టపడి పనిచేయడం ద్వారా సక్సెస్ అవుతారు.
తుల:
ఖర్చులు పెరుగుతాయి. పొదుపు విషయంలో ప్రణాళికలు వేస్తారు. అయితే ఇతరుల వద్ద అప్పు తీసుకోకుండా ఉండాలి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
వృశ్చికం:
వ్యాపారులకు ఆశించిన లాభాలు ఉండవు. ఉద్యోగులు కొన్ని సమస్యల్లో చిక్కుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరీ ఇబ్బంది పడుతారు. కొన్ని పనులను వెంటనే పూర్తి చేయండి..
ధనస్సు:
ఈ రాశివారు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. విద్యార్థులు తమకు కలిగిన ఇబ్బందుల గురించి తల్లిదండ్రులతో చర్చించాలి. జీవిత భాగస్వామితో వాగ్వాదం దిగకుండా ఉండాలి.
మకర:
స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ప్రయాణాలు చేయొచ్చు. కొన్ని విషయాలపై తల్లిదండ్రులతో చర్చిస్తారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు పరిష్కారానికి మార్గం పడుతాయి.
కుంభం:
ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోవద్దు. జీవిత భాగస్వామితో చర్చించిన తరువాతే ఇతరులకు నగదును అప్పు ఇవ్వండి.. వ్యాపారులకు ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి.
మీనం:
వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఏదైనా విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించడం ద్వారా సులువు అవుతుంది.