Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 మార్చి 5 న ద్వాదశ రాశులపై మూలా నక్షత్ర ప్రభావం ఉంటుంది. మంగళవారం చంద్రుడు ధనస్సు రాశిలో సంచరించనున్నాడు. దీంతో వృషభ రాశివారికి పెండింగులో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అలాగే మిగతా రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశివారు ఈరోజు శక్తివంతంగా ఉంటారు. స్నేహితుల సాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కొన్ని ఖర్చులు పెరిగినా ఆదాయం బాగుంటుంది.
వృషభ రాశి:
కోపంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోరాదు. పెండింగులో ఉన్న సమస్యలు నేటితో పూర్తవుతాయి. కొన్ని వనరుల నుంచి ఆదాయం పొందుతారు.
మిధునం:
తెలివితేటలు, నైపుణ్యాలతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. కోర్టు కోసుల్లో విజయం సాధిస్తారు. పెండింగు పనులు పూర్తి చేస్తారు. దైవానుగ్రహం వల్ల కొన్ని పనులు సక్సెస్ అవుతాయి.
కర్కాటకం:
ఆరోగ్యం సమస్యలు తొలగిపోతాయి. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. కొందరు మిమ్మల్ని బాధపెట్టే మాటలు అనొచ్చు.
సింహ:
వ్యాపారులకు లాభదాయంగా ఉంటుంది. ఉద్యోగులు కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో మద్దతు ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
కన్య:
ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పనిభారం పెరుగుతుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు.
తుల:
వాహనాలపై ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు మొదలవుతాయి.
వృశ్చికం:
వ్యాపారులు జీవిత భాగస్వామి నుంచి సలహాలు తీసుకుంటారు. ఇతరలుకు అప్పు ఇవ్వకుండా ఉండాలి. పిల్లల వివాహం విషయంలో బిజీ అయిపోతారు.
ధనస్సు:
దూరపు ప్రయాణాలు ఉంటాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేవారు ప్రణాళికతో ముందుకు వెళ్తారు. పాత స్నేహితులను కలుస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు.
మకర:
కొత్త వ్యక్తుల నుంచి సలహాలు తీసుకోకుండా ఉండడమే మంచిది. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి. ఇంట్లో కొత్త సమస్యలు ఎదురవుతాయి.
కుంభం:
సోదరుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం. ఇంటికి అతిథులు వస్తారు. వ్యాపారులు తల్లిదండ్రుల సలహాలు తీసుకోవాలి. కొన్ని సమస్యలతో బాధపడుతారు.
మీనం:
అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి. సామాజిక అంశాలపై శ్రద్ధ వహించాలి. ఓ సమస్యపై వాగ్వాదం అవుతుంది. కుటుంబ సభ్యులతో సంయమనం పాటించాలి.