https://oktelugu.com/

Horoscope Today : ఈ రెండు రాశులపై శనీశ్వరుడి ప్రభావం… దీంతో అన్నీ అనుకూల ఫలితాలే..

వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. కుటుంబంలో జరిగే కార్యక్రమాల గురించి బిజీగా ఉంటారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 9, 2024 / 08:43 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: గ్రహాల మార్పుతో కొన్ని రాశుల ఫలితాల్లో మార్పులు ఉంటాయి. శనివారం ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో ఫష్ యోగం ఏర్పడనుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారిపై శనీశ్వరుడి ప్రభావం ఉంటుంది. మరికొన్ని రాశుల వారు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మొత్తం రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. పిల్లలతో సరదాగా ఉంటారు. కొన్ని కార్యక్రమాలను పూర్తి చేయడంలో ఒత్తిడిని ఎదుర్కొంటారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఉంటుంది.

    వృషభ రాశి:
    జీవిత భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ రంగాల్లో ఉండేవారికి అనుకూల వాతావరణం.

    మిథున రాశి:
    కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇదే మంచి సమయం. కొన్ని పనుల నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న వివాదాలు నేటితో పరిష్కారం అవుతాయి.

    కర్కాటక రాశి:
    సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంబంధించిన కొన్ని బాధ్యతలను నెరవేరుస్తారు. క్రీడా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

    సింహారాశి:
    కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమలు పెంపొందుతాయి. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు. కొన్ని బాధల నుంచి నేడు విముక్తి పొందుతారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేముందు పెద్దల సలహా అవసరం.

    కన్య రాశి:
    ఉపాధి కోసం ఎదురుచూసేవారు శుభవార్త వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

    తుల రాశి:
    ఆర్థిక లావాదేవీలు జరిపేవారు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు.

    వృశ్చిక రాశి:
    వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. కుటుంబంలో జరిగే కార్యక్రమాల గురించి బిజీగా ఉంటారు.

    ధనస్సు రాశి:
    ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనాలు పొందుతారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రత్యర్థుల నుంచి జాగ్రత్తగా ఉండాలి.

    మకర రాశి:
    ఆర్థికంగా పుంజుకుంటారు. కొన్ని ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. సాయంత్రి ఇంటికి అతిథులు వస్తారు. కొన్ని కారణాల వల్ల డబ్బు ఖర్చు అవుతుంది.

    కుంభరాశి:
    వ్యాపారులు కొంత నష్టాన్ని ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ప్రభుత్వ అధికారికి ఏదైనా దరఖాస్తు చేసుకుంటే ఆ పని పూర్తి అవుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది.

    మీనరాశి:
    ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. ఏదైనా వస్తువు పొగొట్టుకున్నట్లయితే ఈరోజు లభ్యమవుతుంది. ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు. ఆరోగ్య సమస్యల కారణంగా ఆందోళనతో ఉంటారు.