Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 ఫిబ్రవరి 16న ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. శుక్రవారం రథ సప్తమి సందర్భంగా కొన్ని రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది. మరి కొన్ని రాశుల వారికి ప్రతికూల వాతావరణం. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యల్లో చిక్కుకుంటారు. రాజకీయాల్లో కొనసాగేవారికి ప్రయోజనాలు ఉంటాయి. అనుకున్న పనులు పూర్తి కాకపోవడంతో నిరాశ చెందుతారు.
వృషభ రాశి:
కొందరు మీమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. అందువల్ల కొత్త వ్యక్తులను నమ్మొద్దు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడితే లాభిస్తాయి. కుటుంబ సభ్యులపై ఎక్కువగా ప్రేమ చూపిస్తారు.
మిథునం:
ఉద్యోగులు కొన్ని సమస్యల్లో చిక్కుకుంటారు. ఆ విషయం గురించి సీనియర్ అధికారులతో చర్చించడం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. పాత స్నేహితులను కలుస్తారు.
కర్కాటకం:
ఆదాయం సమకూరుతుంది. కొత్త వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓ సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది.
సింహ:
వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులకు కార్యాలయాలయాల్లో ప్రయోజనాలు ఉంటాయి. సోదరుల మధ్య ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి.
కన్య:
కుటుంబ వాతావరణం సాధారణంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో ఆందోళనగా ఉంటారు. ఆదాయం కోసం కొత్త మార్గాలు ఎంచుకుంటారు. ప్రయాణాలు చేస్తారు.
తుల:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. పాత స్నేహితులను కలుస్తారు. కొన్ని విషయాలను ఇతరులకు చెప్పకపోవడమే మంచిది. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు.
వృశ్చికం:
ఈ రాశివారు ఎక్కువగా వాదనలు చేయొద్దు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు.
ధనస్సు:
ఉద్యోగులు కార్యాలయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపార అభివృద్ధికి ప్లాన్ వేస్తారు. ప్రత్యర్థులు ఆధిపత్యం చేసే అవకాశం వారితో జాగ్రత్తగా ఉండాలి.
మకర:
గతంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. వ్యాపారంలో మార్పులు చేస్తారు.
కుంభం:
దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కరిస్తారు. వ్యాపారులు తమ లాభాల గురించి చర్చిస్తారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటే అవి పరిష్కారం అవుతాయి.
మీనం:
ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులకు పనిభారం ఎక్కువగా ఉంటుంది. విలాసవంతమైన వస్తువుల కోసం ఖర్చులు చేస్తారు. జీవిత భాగస్వామిని ఇంప్రెస్ చేస్తారు.