Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 ఫిబ్రవరి 8న ద్వాదశ రాశులపై ఉత్తర పాల్గుణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. గురువారం చంద్రుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో ఓ రాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. మరో రాశి వ్యాపారులకు అధిక లాభాలు వస్తాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈరాశివారికి ఈరోజు అనుకున్న పనులు నెరవేరుతాయి. మానసికంగా దృఢంగా ఉండి ముందుకు సాగుతారు. వ్యాపారులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు.
వృషభ రాశి:
వ్యాపారుల పెట్టుబడులకు దీర్ఘకాలిక లాభాలు వస్తాయి. ఉద్యోగులు సంయమనం పాటించాలి. ఈరోజు అసవరానికంటే ఎక్కువ ఖర్చులు ఉంటాయి. ఆదాయం అనుకున్నంత సమకూరుతుంది.
మిథునం:
ఈరోజు ఈ రాశివారు ఉల్లాసంగా గడుపుతారు. వ్యక్తిగత జీవితంలో మెరుగైన ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు లాభాలు వస్తాయి. ఉద్యోగులు ప్రణాళికతో ముందుకు వెళ్లాలి.
కర్కాటకం:
వ్యాపారులు తమ లోపాలు తెలుసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలి. లేదంటే దీర్ఘకాలికంగా నష్టం జరుగుతుంది. ఉద్యోగులు ఉన్నతాధికారులతో అవగాహన ఒప్పందం చేసుకుంటారు.
సింహ:
గతంలో చేపట్టిన పనులు ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. సంబంధాలు మెరుగవుతాయి.
కన్య:
అసస్మాత్తుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో ఉల్లాసమైన వాతావరణం. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. కటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది.
తుల:
లాభాలపై దృష్టి పెడుతారు. ఆదాయం సమకూరుతుంది. జీవిత భాగస్వామితో గొడవ ఉండే అవకాశం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇతరులతో వాదనలకు దిగొద్దు.
వృశ్చికం:
ఉద్యోగులకు సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తారు. కొపాన్ని నియంత్రించుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య బేధాభిప్రాయాలు రావొచ్చు.
ధనస్సు:
కొన్ని రంగాల వారికి సానుకూల వాతావరణం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగుల ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు.
మకర:
వ్యక్తిగత జీవితం పట్ల జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు ఆధిపత్యానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగులు ఎక్కువగా శ్రమపడాల్సి వస్తుంది. వ్యాపారులకు లాభాలు వస్తాయి.
కుంభం:
ఆదాయ వనరులను పెంచుకోవడంలో శ్రద్ధ వహిస్తారు. జీవిత భాగస్వామితో వాదనలు చేస్తారు.వ్యాపారులకు లాభాలు వస్తాయి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.
మీనం:
ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు లాభాలు వస్తాయి.