Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 ఫిబ్రవరి 26న ద్వాదశ రాశులపై ఉత్తర పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. సోమవారం చంద్రుడు కన్య రాశిలో సంచరించనున్నాడు. దీంతో మీన రాశివారు తమ పర్సనల్ విషయాలను ఇతరులతో పంచుకోవద్దు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఓ విషయంలో ఒత్తిడికి లోనవుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగాలు చేసేవారికి ప్రశంసలు దక్కుతాయి. కొత్త వ్యక్తులతో ఇబ్బందులు ఉంటాయి.
వృషభ రాశి:
భవిష్యత్ కోసం ప్రణాళికలు వేస్తారు. స్నేహితులతో కలిసి విమారయాత్రలకు ప్లాన్ వేస్తారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని వెచ్చిస్తారు. గతంలో చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుంటారు.
మిధునం:
జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కొన్ని కారణాల వల్ల చికాకులు ఉంటాయి. ఉద్యోగులకు కార్యాలయాల్లో పనిభారం పెరుగుతుంది. ఓ సమస్యపై చర్చ పెడుతారు.
కర్కాటకం:
వ్యాపారులు లాభాలపై దృష్టి పెడుతారు. పెట్టుబడుల విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించాలి. ఉద్యోగులకు చిక్కులు ఎదురవుతాయి. వీటిని చాకచక్యంగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.
సింహ:
తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పెండింగు పనులు పూర్తవుతాయి. ఒకేసారి అన్ని పనులు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.
కన్య:
వ్యాపారులు కొన్ని నష్టాలను చవిచూస్తారు. పెట్టుబడి విషయంలో ఆలోచించాలి. ముఖ్యమైన పని గురించి తల్లిదండ్రలతో చర్చిస్తారు. ఇంతకాలం అనుకున్న ఓ పని సక్సెస్ అవుతుంది.
తుల:
పనులకు సమయం కేటాయించకపోవడంతో ఒత్తిడికి లోనవుతారు. స్నేహితులతో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. కుటుంబ సభ్యుల్లో ఒకరు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడవచ్చు.
వృశ్చికం:
వ్యాపార ప్రణాళికపై దృష్టి పెడుతారు. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శారీరక సమస్యలతో బాధపడే అవకాశం.
ధనస్సు:
ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటారు.వ్యాపారులు లాభదాయకరమైన అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులకు సీనియర్ల నుంచి మద్దతు ఉంటుంది.
మకర:
మానసికంగా ధ్రుఢంగా ఉంటారు. ప్రతికూల పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవద్దు. కొన్ని పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది.
కుంభం:
కుటుంబంలో నెలకొన్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. సోదరుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఉంటాయి.
మీనం:
గతంలో చేసిన కొన్ని తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుంటారు. కొన్ని పర్సనల్ విషయాలు ఇతరులతో పంచుకోవద్దు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.