Horoscope Today: ఈ రాశి వారు ఈరోజు అధిక ప్రయోజనాలు పొందుతారు..

Horoscope Today: 2024 జూన్ 3 సోమవారం రోజున ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు.

Written By: Srinivas, Updated On : June 3, 2024 7:56 am

horoscope today

Follow us on

Horoscope Today: 2024 జూన్ 3 సోమవారం రోజున ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి అదనపు ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి వ్యతిరేక ప్రయోజనాలు కోల్పోతారు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
ఈ రాశి వారు ఈరోజు శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువ. ఏదైనా పని పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడుతారు. కొన్ని వర్గాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వృషభ రాశి:
కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఇతరుల నుంచి శుభవార్తలు వింటారు. ప్రైవేట్ ఉద్యోగుల పనితీరుపై ప్రశంసలు దక్కుతాయి.

మిథున రాశి:
సన్నిహితుల ద్వారా ఇబ్బందులు తలెత్తెతాయి. కొందరితో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగులు బాధ్యతతో వ్యవహరిస్తారు.

కర్కాటక రాశి:
ఆర్థిక లాబాదేవీలతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పని కోసం తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. కొన్ని రహస్యాలను ఇతరులకు చెప్పొద్దు. విద్యార్థులు భవిష్యత్ పై ప్రణాళికలు వేస్తారు.

సింహారాశి:
ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు కొత్త విజయాలు అందుకుంటారు.

కన్య రాశి:
చట్టపరమైన విషయాల్లో న్యాయం జరుగుతుంది. కొన్ని కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారులు ఇతరుల సలహాలు తీసుకోవాలి. అపరిచత వ్యక్తులను నమ్మొద్దు.

తుల రాశి:
కుటుంబం విషయాలపై శ్రద్ధ వమించాలి. కొన్ని ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు. ప్రయానాలు చేసే అవకాశం. ఉన్నత విద్య కోసం తీవ్రంగా కృషి చేస్తారు.

వృశ్చిక రాశి:
ఆకస్మిక ప్రయోజనాలు ఉంటాయి. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటారు.

ధనస్సు రాశి:
వైవాహిక జీవితంలో అడ్డంకులు తొలగుతాయి. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారవేత్తలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దీంతో అనూహ్య లాభాలు పొందుతారు.

మకర రాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొందరు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. సీనియర్ల మద్దతు కొసం శ్రమిస్తారు.

కుంభరాశి:
వ్యక్తిగత విషయాలపై శ్రద్ధ వహించాలి. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. వ్యాపారులకు అనుకోని లాభాలు వస్తాయి.

మీనరాశి:
సమాజంలో గౌరవం పెరగుుతంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇతరుల సలహాలు పాటిస్తారు. ఈరోజు మొత్తం ఉత్తేజకరంగా ఉంటుంది.