Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 ఫిబ్రవరి 15న ద్వాదశ రాశులపై అశ్విని నక్షత్ర ప్రభావం ఉంటుంది. గురువారం చంద్రుడు మేష రాశిలో సంచరిస్తాడు. దీంతో ఓ రాశి వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరో రాశివారికి అనుకోని సమస్యలు వస్తాయి.మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రతికూల వాతారణం. ఆదాయం పెరుగుతుంది. కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి. అందువల్ల పొదుపుగా ఖర్చులు చేయాలి.
వృషభ రాశి:
మీ పనులకు ఆటంకం కలిగించే వ్యక్తులు తారసపడుతారు. కొన్ని విషయాల్లో హుందాగా వ్యవహరించడం వల్ల గౌరవం పెరుగుతుంది. కొందరి నుంచి షాకింగ్ న్యూస్ లు వింటారు.
మిథునం:
కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలి. దుబారా ఖర్చులు పెరుగుతాయి. డబ్బుకు సంబంధించిన ఏ వ్యవహారమైన సాయంత్రం చేయాలి.
కర్కాటకం:
కొన్ని వ్యాపార ప్రణాళికలు బెడిసికొడుతాయి. ఉద్యోగులకు సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఉంటుంది. స్నేహితులు సహకరిస్తారు.
సింహ:
కుటుంబ సభ్యులతో వాదనలు ఉంటాయి. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బుకు సంబంధించిన విభేదాలు ఉంటాయి. కొందరికి ఓ విషయంలో ఒత్తిడి పెరుగుతుంది.
కన్య:
ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. వ్యాపారులు ఎక్కవగా వాదనలకు దిగొద్దు. కొన్ని పనులకు ఆటంకం కలుగుతుంది. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి.
తుల:
ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులకు దూరంగా ఉండాలి. కొన్ని పనుల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. వ్యాపారులు పెట్టిన పెట్టుబడులకు భవిష్యత్ లో లాభాలు వస్తాయి.
వృశ్చికం:
కొన్ని విషయాల్లో ఉద్యోగులు ఉల్లాసంగా గడుపుతారు. గొడవలకు దూరంగా ఉండాలి. వ్యాపారులు మోసపోయే అవకాశాలు ఎక్కువ. డబ్బు వ్యవహారంలో చాకచక్యంగా వ్యవహరించాలి.
ధనస్సు:
కొన్ని పనుల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఏదైనా ఇబ్బందికరమైన పనులు ఉంటే వాయిదా వేయడం మంచిది. కటుుంబ సభ్యలతో బావోద్వేగాలు ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.
మకర:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులు కొన్ని విషయాల్లో సమస్యలు ఎదుర్కొంటారు.
కుంభం:
డబ్బు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆధ్యాత్మిక వాతావరణంలో గడుపుతారు. మానసికంగా ఆందోళనలు ఉంటాయి. కుటుంబ సభ్యుల పట్ల సానుభూతి చూపిస్తారు.
మీనం:
రోజూవారీ పనులు ఆలస్యంగా ప్రారంభం అవుతాయి. అకారణంగా అశాంతి నెలకొంటుంది. మధ్యాహ్నం తరువాత కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.