https://oktelugu.com/

Horoscope Today: నేడు హోలీతో పాటు చంద్రగ్రహణం.. ఈ రాశులపై ప్రభావం..

2024 మార్చి 25న ద్వాదశ రాశులపై హస్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : March 25, 2024 / 07:23 AM IST

    Holy chandragrahanam

    Follow us on

    Horoscope Today: హోలీ పండుగ నేపథ్యంలో సోమవారం చంద్రుడు కన్య రాశిలో సంచారం చేయనున్నాడు . ఈనేపథ్యంలో కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే చంద్రగ్రహణం సందర్భంగా మరికొన్ని రాశుల వారు ప్రతికూల ఫలితలు ఎదుర్కొంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 మార్చి 25న ద్వాదశ రాశులపై హస్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సందర్భంగా 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేషరాశి:
    ఈ రాశి వారు కొన్ని ముఖ్యమైన పనుల్లో పాల్గొంటారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    వృషభ రాశి:
    కొత్త వస్తువులు కొనుగోలు చేరస్తారు. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ రంగంలో పనిచేసవారికి పదోన్నతి ఉండే అవకాశం. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.

    మిథునం:
    కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. భవిష్యత్ గురించి ప్రణాళికలు వేస్తారు. ఓ విషయంపై కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. ఉద్యోగులు ముఖ్యమైన విషయాలపై సీనియర్లతో చర్చిస్తారు.

    కర్కాటకం:
    వ్యాపారులు ప్రణళిక ప్రకారంగా పెట్టుబడులు పెట్టాలి. ఆస్తికి సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వింటారు. వివాహ ప్రతిపాదనలు ఉంటాయి.

    సింహ:
    ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులను కలుస్తారు. కోర్టుకు సంబంధించిన విషయాలు తలనొప్పిగా మారవచ్చు. కొన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది.

    కన్య:
    ప్రియమైన వారితోసంతోషంగా ఉంటారు. ఉద్యోగులుకార్యాలయాల్లోసంతోషంగా ఉంటారు. ఏదైనా వివాదాలు ఉంటే సహనంతో ఉండాలి. గతంలో చేసిన తప్పుల నుంచి ఉపశమనం పొందుతారు.

    తుల:
    రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రయోజనాలు ఉంటాయి. ఆకస్మిక అదృష్టం వరిస్తుంది. ఇతరులను గుడ్డిగా నమ్మొద్దు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    వృశ్చికం:
    ఈ రాశివారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. పిల్లల చదువుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.

    ధనస్సు:
    టీమ్ వర్క్ చేయడం ద్వారా కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉంటారు. విద్యార్థులు ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.

    మకర:
    ఉద్యోగులు కార్యాలయాల్లో అజాగ్రత్తగా ఉండొద్దు. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. కొత్త వ్యక్తులను నమ్మొద్దు.పెట్టుబడుల విషయంలో ఇతరుల సలహాలు తీసుకోవాలి.

    కుంభం:
    ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా ఉంటారు. పాత స్నేహితులను కలుస్తారు. వ్యాపారులు దీర్ఘకాలిక ప్రణాళికల గురించి ఆలోచిస్తారు.

    మీనం:
    వ్యాపారులకు లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. ఆస్తుల కొనుగోలుకు ప్లాన్ వేస్తారు. రాజకీయ నాయకులకు తోటి వారి నుంచి మద్దతు ఉంటుంది.