https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశి వారికి ఈరోజు ఖర్చులు అధికం..

024 ఏప్రిల్ 5న ద్వాదశ రాశులపై ధనిష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈనేపథ్యంలో ఓ రాశివారికి ఖర్చులు అధికంగా ఉంటాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : April 5, 2024 / 05:50 AM IST

    Horoscope today

    Follow us on

    Horoscope Today: 2024 ఏప్రిల్ 5న ద్వాదశ రాశులపై ధనిష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈనేపథ్యంలో ఓ రాశివారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. మరో రాశి వారు శుభవార్తలు వింటారు. శుక్రవారం చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ నేపథ్యంలో 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

    మేషరాశి:
    ఈ రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యలతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన మేర ఆదాయం ఉంటుంది.

    వృషభ రాశి:
    ఈ రాశివారికి ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు తీవ్రంగా ఉంటాయి. వైవాహిక జీవితం ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగులకు తోటివారి సాయం ఎక్కువగా ఉంటుంది.

    మిథునం:
    ఆదాయ ప్రణాళికలు వేస్తారు. కొన్ని శుభవార్తలు వింటారు. చిన్న పాటి వేడుకల్లో పాల్గొంటారు. పిల్లల భవిష్యత్ పై ఆందోళన చెందుతారు. ఖర్చులు పరమితం చేసుకోవాలి.

    కర్కాటకం:
    నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. అవసరాలకు డబ్బు అందుతుంది. రాజకీయ రంగాల వారికి శ్రమ అధికం. కొన్ని విషయాల్లో సంతోషంగా గడుపుతారు.

    సింహ:
    వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి అవకాశాలు వస్తుంటాయి. కొన్ని విషయాల్లో కష్టపడాల్సి వస్తుంది. ఆర్థిక సమస్యలతో బాధపడుతారు.

    కన్య:
    ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. శత్రువల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు ఇతరులతో పంచుకోకూడదు.

    తుల:
    ఈ రాశివారు కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగులు పదోన్నతులపై మాట్లాడుతారు. కుటుంబ సభ్యులతో సమయం వెచ్చిస్తారు. సామాజిక రంగాల్లో పాలుపంచుకుంటారు.

    వృశ్చికం:
    పెట్టుబడుల విషయంలో ప్లాన్లు వేస్తారు. విహారయాత్రలకు వెళ్లాలనుకుంటే వాయిదా వేయడం మంచిది. జీవిత భాగస్వామి నుంచి సలహాలు పొందుతారు.

    ధనస్సు:
    స్నేహితులతో సరదాగా గడుపుతారు. రాజకీయ రంగాల వారు పెద్ద పదవులు పొందే అవకాశం. వ్యాపారంలో కొన్ని ప్రణాళికలు వేస్తారు. ఉద్యోగులు తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి.

    మకర:
    గతంలో నిర్ణయించుకున్న లక్ష్యాలను నెరవేరుస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. పెండింగు పనులను పూర్తి చేస్తారు.

    కుంభం:
    వ్యాపారస్థులకు ఆశించిన లాభాలు వస్తాయి. కొందరు మీపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. చాలాకాలంగా పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు.

    మీనం:
    ఎవరికైనా డబ్బు ఇస్తే దానిని తిరిగి పొందుతారు. భవిష్యత్ గురించి ప్లాన్ వేస్తారు. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో సమస్యలు ఎదుర్కొంటారు.