https://oktelugu.com/

Horoscope Today: సుకర్మ యోగం కారణంగా ఈ రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు..

జీవిత భాగస్వామితోకలిసి ప్రయాణాలు చేస్తారు. కొన్ని సమస్యలు పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : October 10, 2024 / 07:47 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: పంచాంగం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై పూర్వాషాఢ నక్షత్ర ప్రభావం ఉండనుంది. అలాగే ఈరోజు చంద్రుడు ధనుస్సు రాశిలో సంచరించనున్నాడు. సుకర్మయోగం ఏర్పడనున్న ఈరోజు కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అనుకోని అదృష్టం కలిగి ఇంట్లోకి ధనం వస్తుంది. మరికొన్ని రాశుల వ్యాపారులు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపథ్యంలో మిగతా రాశుల ఫలితాలు ఎలా ఉండనున్నాయో చూద్దాం..

    మేష రాశి:
    ఓ విషయంలో జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటాయి. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

    వృషభ రాశి:
    జీవిత భాగస్వామితోకలిసి ప్రయాణాలు చేస్తారు. కొన్ని సమస్యలు పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

    మిథున రాశి:
    కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఉన్నత విద్య కోసం కష్టపడుతారు. వ్యాపారస్తులుకు కొత్త ఆదాయం సమకూరుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    కర్కాటక రాశి:
    నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. ఏదైనా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే వెనకాముందు ఆలోచించాలి. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు.

    సింహారాశి:
    ఈ రాశి వారికి శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు ఉండొచ్చు. కుటుంబ సభ్యులను కొన్ని విషయాల్లో ఒప్పించడానికి తీవ్రంగా కృషి చేస్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది.

    కన్య రాశి:
    ఈ రాశి వారికి ఈరోజు నిరాశతో ఉంటారు. కొన్ని సంబంధాలు చెడిపోయే అవకాశం. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి.

    తుల రాశి:
    ఉద్యోగులు కొన్ని పొరపాట్లు చేస్తారు. వ్యాపారులకు కొన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. పిల్లల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. పెండింగ్ పనుల విషయంలో ఆందోళన చెందాల్సి ఉంటుంది.

    వృశ్చిక రాశి:
    దీర్ఘకాలికి సమస్యలతో బాధపడుతారు. మనశ్శాంతి కరువవుతుంది. కుటుంబంలోని మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పెండింగ్ లో ఉన్న డబ్బు తిరిగి వస్తుంది. కొన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

    ధనస్సు రాశి:
    ఆదాయం పెరుగుతుంది. ఇదే సమయంలో ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. జీవిత భాగస్వామి కోసం ఓ బహుమతిని కొనుగోలు చేస్తారు. కొన్ని విషయాల పట్ల మానసిక ఆందోళనతో ఉంటారు.

    మకర రాశి:
    వివాహ ప్రయత్నాలు మొదలవుతాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రులకు సేవ చేస్తారు. పిల్లల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు.

    కుంభరాశి:
    మాటలను అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు అధిక ఆదాయం సమకూర్చడంలో విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.

    మీనరాశి:
    జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కొన్ని పనుల కసం సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. ఆహ్లదకరమైన వాతావరణంలో గడుపుతారు. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి.