https://oktelugu.com/

Horoscope Today: సుకర్మ యోగం కారణంగా.. ఈ రాశుల వారికి అనుకూల ఫలితాలు..

ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వివాహ ప్రయత్నాలు ఉంటాయి. కొందరు మిమ్మల్ని ఈ విషయంలో బాధపెట్టే అవకాశం ఉంది. అందువల్ల కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం సరదాగా ఉంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : December 1, 2024 / 07:55 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశుల జీవితాల్లో మార్పులు ఉంటాయి. ఆదివారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు అమావాస్య కారణంగా కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉండనున్నాయి. అలాగే ఈరోజు సుకర్మ యోగం కారణంగా కన్యతో సహా మరో రాశి వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. మేషం నుంచి మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వివాహ ప్రయత్నాలు ఉంటాయి. కొందరు మిమ్మల్ని ఈ విషయంలో బాధపెట్టే అవకాశం ఉంది. అందువల్ల కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం సరదాగా ఉంటారు.

    వృషభరాశి:
    మాటలను అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి. కొన్ని సమస్యలు స్నేహితులతో పరిష్కారం అవుతాయి.

    మిథున రాశి:
    ఈ రాశి వ్యాపారులు నష్టపోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులకు డబ్బు సాయం చేస్తారు. ముఖ్యమైన మనుల్లో బిజీగా ఉంటారు.

    కర్కాటక రాశి:
    జీవిత భాగస్వామి కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. స్నేహితుడి సాయంతో కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడుతారు. ఉద్యోగులు తీవ్రంగా కస్టపడాల్సి వస్తుంది. వ్యాపారులకు అధిక లాభాలు ఉంటాయి.

    సింహా రాశి:
    కష్టపడి పని చేసిన వారికి అద్భతమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. వాదనలకు దూరంగా ఉండాలి. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఇప్పుడు అనువైన సమయం కాదు.

    కన్యరాశి:
    ఎవరిదగ్గరైనా అప్పుగా తీసుకోవాల్సి వస్తే సులభంగా పొందుతారు. విదేశాల్లో ఉన్నబంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టును మొదలుపెడుతారు. కుటుంబ వాతావరణం ఆహ్లదంగా ఉంటుంది.

    తుల రాశి:
    ఓ సమాచారం ఆందోళనను కలిగిస్తుంది. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. దొంగిలించబడిన వస్తువులు దొరకడంతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    వృశ్చిక రాశి:
    వ్యాపారులు కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తారు. కొన్ని పనులు సక్సెస్ కావడంతో సంతోషంగా ఉంటారు. కుటుంబ వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

    ధనస్సు రాశి:
    రాజకీయ రంగాల్లో ఉన్న వారికి అనుకూల సమయం. ఉద్యోగులు జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు. కొందరు జీవితానికి సంబంధించిన విలువైన విషయాలు చెబుతారు.

    మకర రాశి:
    కుటుంబంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఒకరి ఆరోగ్యం క్షీణిస్తుంది. పాత గొడవలను పూర్తిగా పరిష్కరించుకోవాలి. లేకపోతే తీవ్ర నష్టం కలుగుతుంది. రోజూవారీ అవసరాలకు ఖర్చులు పెరుగుతాయి.

    కుంభ రాశి:
    ఉద్యోగులు లక్ష్యాన్ని పూర్తి చేస్తారు. విద్యార్థులు కష్టపడాల్సి వస్తుంది. పూర్వీకులకు సంబంధించిన ఆస్తిని పొందుతారు. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు.

    మీనరాశి:
    స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులు సీనియర్లతో వేధింపులు ఎదుర్కొంటారు. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉంటాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్యం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.