Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 మార్చి 3 న ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఆదివారం చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరించనున్నాడు. దీంతో ఓ రాశి వారు ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండాలి. మరో రాశి వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశివారు ఈరోజు ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగులు తోటి వారితో స్నేహపూర్వకంగా మెదులుతారు. కొత్త వ్యక్తుల మాటలు నమ్మొ మోసపోవద్దు.
వృషభ రాశి:
ఈ రాశివారికి కొత్త ఆస్తులు సమకూరుతాయి. ఇతరులతో వాదనలకు దిగకుండా జగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.
మిధునం:
ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. అయితే ఖర్చులు తగ్గించుకోవాలి. రుణాల కారణంగా చిక్కుకున్న డబ్బు విడుదల అవుతుంది. ఉద్యోగం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తారు.
కర్కాటకం:
ఈ రాశివారు ఈరోజు ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే ఈరోజుతో పరిష్కారం అవుతుంది. వ్యాపారులు ఆశించిన లభాలు పొందుతారు.
సింహ:
జీవిత భాగస్వామితో గొడవలు ఉండొచ్చు. కొత్త వ్యక్తులకు ఎటువంటి వాగ్దానాలు చేయొద్దు. చట్ట విరుద్ధమైన పెట్టుబడుల విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అలాంటి వాటికి దూరంగా ఉండడం మంచిది.
కన్య:
కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. సామాజిక కార్యక్రమం ద్వారా సమాజంలో గౌరవం పెరుగుతుంది. తోటివారి సాయంతో పెండింగు పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులు అధికారులతో సత్సంబంధాలతో ఉండాలి.
తుల:
ఇతరులకు సాయం చేసేటప్పుడు ఆలోచించాలి. చుట్టుపక్కల వారితో వివాదం ఉంటే మౌనంగా ఉండడమే మంచిది. కొందరు వ్యక్తుల నుంచి ప్రయోజనాలు పొందుతారు.
వృశ్చికం:
స్నేహితులతో వాగ్వాదం ఉంటుంది. కొన్ని అవసరాల కోసం ఆందోళన చెందుతారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో ఇతరుల సలహాలు తీసుకోవాలి.
ధనస్సు:
కుటుంబ జీవితం ఆందోళనకరంగా ఉంటుంది. పెండింగు పనులను సకాలంలో పూర్తి చేయాలి. లేకుంటే అవి తీవ్ర సమస్యలుగా మారుతాయి. ఎవరికైనా అప్పు ఇస్తే వెంటనే తిరిగి పొందుతారు.
మకర:
ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఖర్చులు పెరగవచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులు తోటివారితో స్నేహపూర్వకంగా ఉంటారు.
కుంభం:
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. గతంలో చేసిన తప్పులపై గుణపాఠం నేర్చుకుంటారు. ఉద్యోగులు కొత్త ఉద్యోగాన్ని వెతుక్కుంటారు.
మీనం:
రుణాల కారణంగా చిక్కుకున్న డబ్బు వసూలవుతుంది. వ్యాపారులు ఇతరుల సలహా మేరకు పెట్టుబడులు పెట్టాలి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు.