Homeఆధ్యాత్మికంLakshmi never enters: ఇలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు అడుగుపెట్టదు.. ఎందుకో తెలుసా?

Lakshmi never enters: ఇలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు అడుగుపెట్టదు.. ఎందుకో తెలుసా?

Lakshmi never enters: అపర చాణక్యుడు రాజనీతి బోధనలతో పాటు జీవితానికి సంబంధించిన కొన్ని విలువైన సూత్రాలను ప్రజలకు అందించారు. వీటిని కొందరు ఫాలో చేయడం వల్ల వారు సంతోషంగా ఉంటున్నారు. అయితే చాలా మంది తమ జీవితానికి సంబంధించి కొన్ని చిక్కుల్లో పడుతున్నారు. కానీ వాటి పరిష్కారానికి ఎటువంటి మార్గం కనిపించడం లేదు.ఇలాంటి సమయంలో చాణక్య నీతి సూత్రాలను ఫాలో అయితే వారి జీవతాలు సంతోషంగా ఉంటాయి. కొందరు ఎంత డబ్బు సంపాదిస్తున్నా.. తమ జీవితం సంతోషంగా లేదని అంటుంటారు. అలాగే తమకు లక్ష్మీ దేవి కరుణించడం లేదని బాధపడుతూ ఉంటారు. అయితే వారు చేసే కొన్ని పొరపాట్ల వల్లనే వారి ఇల్లు ఎప్పుడూ దు:ఖంతో నిండి ఉంటుంది. ఆ పొరపాట్ల గురించి తెలుసుకొని వాటిని చేయకుండా జాగ్రత్త పడాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఇల్లు సంతోషంగా ఉన్నప్పుడే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుందని అంటారు. ఇంట్లో కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి. చీటికి మాటికి గొడవ పడకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరు గొడవపడినా..మరొకరు కాస్త తగ్గి వారి సమస్యకు పరిస్కారమేంటో అర్థం చేసుకోవాలి. ఒకరు గొడవ చేస్తున్నారని, మరొకరు మరింత గొడవకు దిగడం వల్ల ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది. అలాగే కొందరు చిన్న విషయాల్లో కూడా బూతు పదాలు వాడుతూ ఉంటారు. ఇలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టడానికి సంకోచిస్తూ ఉంటుంది.

కొందరు పరిశుభ్రంగా ఎలా ఉండాలో అవగాహన కలిగి ఉంటారు. కానీ తమ ఇల్లును మాత్రం నీట్ గా ఉంచుకోవడంపై నిర్లక్ష్యంగా ఉంటారు. ఇంట్లో చెత్త ఉన్నా.. దానిని పట్టించుకోకుండా మిగతా పనులు చేస్తుంటారు. ఇలా ఎప్పుడూ చెత్త ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టడానికి ముందుకు రాదు. అలాగే కనీసం ఆరు నెలలకు ఓసారి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇంట్లో ఏ మూలన చెత్త ఉన్నా ఆ ఇంట్లో వారికి ఎప్పుడూ అనారోగ్యమే ఎదురవుతుంది. అంతేకాకుండా పరిశుభ్రంగా ఉంచని ఇంట్లో ఎలాంటి పూజలు చేసినా ఫలితం ఉండదు.

ప్రతీ ఇంటికి వంటిల్లు లక్ష్మీలాంటిది. ఎందుకంటే ఈ ఇంట్లో నుంచే కుటుంబసభ్యులకు ఆహారం అందుతుంది. అలాంటి సమయంలో వంటిల్లును పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. వంటిల్లు నీట్ గా ఉంటనేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అలాగే వంటిల్లు పరిశుభ్రంగా ఉండడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. కొందరు రాత్రి సమయంలో వంట పాత్రలను క్లీన్ చేయకుండా అలాగే వదిలేస్తారు. అలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది.

ఇంట్లో పెద్దవారిని కొందరు పట్టించుకోరు. దీంతో వారు తీవ్ర మనస్థాపానికి గురవుతూ ఉంటారు. ఇంట్లో పెద్దవవారి మనసు బాగా లేకపోతే ఇల్లు కూడా బాగుండదు అనే విషయం తెలుసుకోవాలి. అందువల్ల ఇంట్లో ఉన్న పెద్దవారిని ఎప్పుడూ గౌరవిస్తూ ఉండాలి. దీంతో ఇంట్లో సుఖషాంతులు ఉండడంతో పాటు డబ్బు నిల్వకు కొదువ ఉండదు. కొందరు ఎంత డబ్బు సంపాదించి ఇంట్లో పెద్దలను బాధపెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా నష్టాలను ఎదుర్కొంటారు

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular