Green stone
Gem: జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలని ప్రతీ ఒక్కరూ కూడా కోరుకుంటారు. వీటి కోసం ఎన్నో ప్రయత్నాలు చేయడంతో పాటు ఇతరులు ఏం చెప్పినా కూడా వింటారు. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రాన్ని ఎక్కువగా ఫాలో అవుతుంటారు. దీంతో ఏ పంతులు ఏం చెప్పినా కూడా వింటారు. కొందరు అయితే ఆ పని చేయాలి, ఇది ధరించాలని అంటుంటారు. అనుకున్న పనులు జరుగుతాయని చెప్పినది కూడా చేస్తుంటారు. కొందరు ఎక్కువగా రత్నాలు ధరిస్తుంటారు. వీటిని ధరించడం వల్ల అనుకున్న పనులు అన్ని కూడా జరుగుతాయని అంటుంటారు. ఈ క్రమంలో కొందరు కొన్ని రత్నాలు ధరిస్తుంటారు. అసలు ఏ రంగు రత్నం ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
రత్నం
రత్నాన్ని ధరించడం వల్ల అంతా మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. దీన్ని సరైన సమయంలో ధరిస్తే జీవితంలో అన్ని పనులు కూడా అనుకూలంగా ఉంటాయి. ఏ పని తలపెట్టినా కూడా విజయమే లభిస్తుంది. ఎలాంటి సమస్యలు కూడా కుటుంబంలో ఉండవని పండితులు చెబుతున్నారు.
నీలమణి
ఈ రత్నాన్ని ధరించడం వల్ల జీవితంతో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అన్ని ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఏ పని తలపెట్టినా కూడా విజయమే లభిస్తుంది. ఈ నీలమణి రత్నం వల్ల వ్యాపారంలో లాభం వస్తుంది. దీన్ని ధరించి వ్యాపారం మొదలు పెడితే చాలు.. అసలు నష్టమే ఉండదని పండితులు అంటున్నారు.
పచ్చ రత్నం
పచ్చను ధరించడం వల్ల కెరీర్‌లో మంచి పురోగతి లభిస్తుంది. ఈ రత్నాన్ని ధరించడం వల్ల విశ్వాసం కూడా పెరుగుతుంది. అలాగే మేధో సామర్థ్యం మెరుగుపడుతుంది. ఈ రత్నాన్ని ధరించడం వల్ల సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి.
పులి రత్నం
టైగర్ రత్నం ధరించడం వల్ల జీవితంలో ఉన్నతమైన ఫలితాలు చూస్తారు. దీన్ని సరైన రోజు ధరించడం వల్ల ఆర్థిక సమస్యలు క్లియర్ అవుతాయి. అయితే వీటిని ఒక్కో రాశి వారు ఒక్కో రోజు ధరించాలి. కాబట్టి మీ రాశి ప్రకారం ఏ రోజు ధరించాలో ఆరోజే ధరించండి. దీన్ని ధరిస్తే ఇంట్లో డబ్బు కూడా వృద్ధి చెందుతుంది. అలాగే కెరీర్ విజయానికి కూడా ఈ రత్నం సహాయపడుతుంది.
జేడ్ స్టోన్
ఈ రత్నం ధరించం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే చదువులో కూడా రాణిస్తారు. జేడ్ స్టోన్ ధరించడం గౌరవం, సంపద పెరుగుతాయి. అలాగే ఒత్తిడి లేకుండా చేస్తుంది. నిరాశ, ఆందోళన నుంచి విముక్తి కలిగిస్తుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. పూర్తి వివరాలు కోసం పండితులను సంప్రదించగలరు.