https://oktelugu.com/

Ganesh nimajjanam : వినాయకుని నిమజ్జనం ఎప్పుడు చేయాలంటే?

చాలా మంది మంచి ముహర్తంలో వినాయకుడిని ప్రతిష్టిస్తారు. కానీ నిమజ్జనం చేసేటప్పుడు అసలు ముహర్తం కూడా చూసుకోరు. అయితే వినాయకుడిని కేవలం చతుర్దశి తిథిలో నిమజ్జనం చేయాలని పండితులు చెబుతున్నారు. వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించి నప్పుడు ఎలాగో మంచి సమయం చూసుకుంటామో.. అలాగే నిమజ్జనం చేయాలని పండితులు అంటున్నారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 16, 2024 / 05:59 PM IST

    Ganesh Nimajjanam

    Follow us on

    Ganesh nimajjanam : అందరికీ అన్ని పండుగల్లో గణేష్ పండుగ చాలా ఇష్టం. ఎందుకు అంటే దీనికి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. వినాయక చవితి రోజు నుంచి నిమజ్జనం చేసే వరకు ఎన్ని పనులు ఉన్న పక్కన పెట్టి మరి ఎంజాయ్ చేస్తారు. గ్రామాల్లో అయితే ఉద్యోగాల కోసం బయటకు వెళ్లిన వాళ్లు కూడా ఈ పండుగకి తప్పకుండా ఊరు వస్తారు. సెలవులు ఇవ్వకపోయిన ఎదో ఒక కారణం చెప్పి మరి తప్పకుండా గ్రామంలో ఉంటారు. అయితే 10 రోజులు ఎంతో ఘనంగా వినాయకుని ఉత్సవాలు జరుపుకున్నారు. ఇక వినాయకుని నిమజ్జనం చేయాల్సిన సమయం వచ్చేసింది. చాలా మందికి వినాయకుని నిమజ్జనం చేసేటప్పుడు ఎంతో బాధ పడతారు. అయితే ఇలా బాధ పడుతూ వినాయకునికి నిమజ్జనం చేయకూడదు. సంతోషంగానే అతనికి వీడ్కోలు పంపాలి. ఎంత బాధ పడిన కూడా తప్పకుండా గణేశుడుని నిమజ్జనం చేయాల్సిందే. అది ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయం. అయితే ఈ ఏడాది వినాయకుని నిమజ్జనం చేయాల్సిన సమయం ఎప్పుడు? ఏ తిథిలో నిమజ్జనం చేయాలో మరి ఈ రోజు తెలుసుకుందాం.

    చాలా మంది మంచి ముహర్తంలో వినాయకుడిని ప్రతిష్టిస్తారు. కానీ నిమజ్జనం చేసేటప్పుడు అసలు ముహర్తం కూడా చూసుకోరు. అయితే వినాయకుడిని కేవలం చతుర్దశి తిథిలో నిమజ్జనం చేయాలని పండితులు చెబుతున్నారు. వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించి నప్పుడు ఎలాగో మంచి సమయం చూసుకుంటామో.. అలాగే నిమజ్జనం చేయాలని పండితులు అంటున్నారు. ఒక్కోరికి వీలు ఉన్న రోజులు నిమజ్జనం చేస్తారు. కానీ శాస్త్రం ప్రకారం చతుర్థశి తిథిలోనే నిమజ్జనం చేయాలి. అయితే చతుర్థశి తిథి అయిన సెప్టెంబర్ 16 మధ్యాహ్నం 3:10 నుంచి సెప్టెంబర్ 17 మంగళవారం ఉదయం 11:44 గంటల లోగా నిమజ్జనం చేయాలి. ఈ తిథిలో వినాయకుని నిమజ్జనం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు అంటున్నారు. అయితే వినాయకుని నిమజ్జనానికి మొత్తం నాలుగు చోఘడియ ముహూర్తాలు ఉన్నాయి. ఈ శుభ సమయాల్లో వినాయకుని నిమజ్జనం చేయడం వల్ల మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. సెప్టెంబర్ 17 న ఉదయం 8:38 నుంచి మధ్యాహ్నం 1:13 వరకు మొదటి ముహర్తం. రెండోది మధ్యాహ్నం 2:44 నుంచి సాయంత్రం 4:16 వరకు ఒక ముహర్తం. సాయంత్రం 7:16 నుంచి రాత్రి 8:44 వరకు మూడో ముహర్తం. నాలుగోది రాత్రి 10:13 నుంచి అర్ధరాత్రి 2:38 వరకు నిమజ్జనం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. అయితే ఉదయాన్నే లేచి వినాయకునికి చివర రోజు పూజలు నిర్వహించి, ఇష్టమైన నైవేద్యాలు పెట్టి ఆ తర్వాత నిమజ్జనం చేయాలని పండితులు అంటున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీనిని గూగుల్ ఆధారంగా చెప్పడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. మీరు ఇవి పాటించే ముందు పండితుల సూచనలు తీసుకోవాలి.