Ganesh Navaratri 2025: వినాయక నవరాత్రులు వస్తున్నాయి. ఆబాల గోపాలం ఎంతో ఇష్టంగా పాల్గొనే ఈ ఉత్సవాల నుంచి నాయకులు ఉద్భవిస్తున్నారు.
ఒకసారి మీకు దగ్గరలో ఏర్పాటు చేసిన, చేస్తున్న వినాయక మండపాల నిర్వహణ కమిటీ బాధ్యులను పరిశీలించండీ. వారిలో ఆ కమిటీని లీడ్ చేసే వ్యక్తి భవిష్యత్తులో తప్పనిసరిగా ఒక నాయకుడిగా కనిపిస్తాడు.
ఇప్పుడు వివిధ రంగాల్లో నాయకులుగా ఎదుగుతున్న వారిలో ఎక్కువ శాతం ఈ ఉత్సవ కమిటీ లకు గతంలో ప్రాతినిధ్యం వహించిన వారే అన్న విషయం మీరు గమనిస్తే తెలిసిపోతుంది.
వినాయకుడు ఎంతోమంది నాయకులను ఈవిధంగా తయారు చేస్తూనే ఉన్నాడు..
బ్రిటిష్ సామ్రాజ్య వాదాన్ని కూకటి వేళ్ళతో పెకిలించి వేసేందుకు బాల గంగాధర్ తిలక్ ముంబై లో ప్రారంభించించిన గణేష్ నవరాత్రి ఉత్సవాల వెనుక ఒక మహత్తరమైన లక్ష్యం ఉంది. నాయకత్వ లక్షణాలను అలవర్చేందుకు ఏర్పాటు చేసిన ఈ ఉత్సవ కమిటీలు దేశ వ్యాప్తంగా విస్తరించి బ్రిటీష్ దొరల వెన్నులో వణుకు పుట్టించాయి. అక్కడితోనే ఆగకుండా ఇప్పటికీ నిరాటంకంగా ఈ ఉత్సవ కమిటీలు అలరారుతూ ఎంతోమంది నాయకులకు పురుడుపోశాయి. పోస్తున్నాయి.
ఆ నాయకత్వ లక్షణాలు ఎలా అలవడుతాయో చూద్దాం..
ఈ ఉత్సవాలు నాయకులను తీర్చిదిద్దే క్రాష్ కోర్సు..
ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం..
సభ్యులందరినీ చేర్పించడం, వారితో కూడి ఒక పద్దతి ప్రకారం కార్యక్రమాలను నిర్వహించడం చూస్తూనే ఉన్నాము. ఈ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన నాయకత్వ లక్షణాలు అక్కడే అలవర్చుకుంటాయి. వివిధ రకాల మనస్తత్వాలు కలిగిన సభ్యులతో కూడిన కమిటీని సమర్థవంతంగా నిర్వహించడం ఆషామాషి కాదు.
ఆర్థిక వనరుల నిర్వహణ:
నవరాత్రులను నిర్వహించేందుకు అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం నుంచి ప్రారంభం అవుతుంది.
వాటిని చక్కగా వినియోగించుకోవడం, జమ, ఖర్చు లెక్కలు నిర్వహించడం చాలా ముఖ్యమైన పనికి ఆర్థిక వ్యవహారాల కమిటీ ఏర్పాటు
అలంకరణ చేసేందుకు..
విగ్రహం ఏర్పాటుకు అనువైన స్థలం, వేదిక, అలంకరణ చేసేందుకు కొంతమంది సభ్యులతో కూడిన ఒక కమిటీ ఏర్పాటు చేయడం
పూజ కార్యక్రమాలు
ప్రతీ రోజు విఘ్నేశ్వరునికి క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం నిత్యపూజ చేయించే విషయంలో అవసరమైన ఏర్పాట్లు చేయడానికి ఒక కమిటీ
నిత్యాన్నదానం, ప్రభోజనం ఏర్పాట్లు
ప్రతీ రోజు అన్నదానంతో పాటు, చివరి రోజు ప్రభోజనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు ప్రత్యేక కమిటీ నిర్వహించడం.
సాంస్కృతిక కార్యక్రమాలు
ప్రతీ రోజు వినాయక మండపాల వద్ద భక్తులకు ఆహ్లాదపరించేందుకు వీలుగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు కమిటీ
Also Read: తప్ప తాగి వినాయకుడి ముందు డాన్స్ చేస్తున్నారా?
నిమజ్జనం
అన్నింటికన్నా ఎంతో ముఖ్యమైన కార్యక్రమ నిర్వహణ నిమజ్జనం అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు కమిటీ.
ఈ కమిటీలు చక్కగా నిర్వహించేందుకు వారిని సమన్వయపరుస్తూ, వారికి అవసరమైన తోడ్పాటు అందించేందుకు ముందుకు నడిచే వాడే నాయకుడు.
ఈ నిర్వహణ చక్కగా చేసిన వారే భవిష్యత్ లో నాయకులుగా విజయవంతమయ్యేందుకు పునాదిరాళ్లుగా తోడ్పడుతాయనడంలో సందేహం లేదు. వారు కేవలం రాజకీయాల్లోనే కాకుండా వ్యాపార, వాణిజ్య, ఉద్యోగ రంగాల్లో రాణించేందుకు అవసరమైన నాయకత్వ లక్షణాలు ఉపయోగపడుతాయి.