Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉంటుంది. ఒక్కోసారి రెండు గ్రహాలు మరోసారి మూడు గ్రహాలు కలయిక వల్ల ఆయా రాశులపై ప్రభావం పడుతుంది. ఫిబ్రవరి నెల మాఘమాసంలో 26వ తేదీన గ్రహాల కలయికలో ఒక అద్భుతం జరగబోతోంది. ఈరోజు నా సూర్యుడు చంద్రుడు బుధ శని నాలుగు గ్రహాలు ఒకే దారిలో ఉంటాయి. వీటి కలయిక ఈరోజు ప్రారంభమై మార్చి 14 వరకు ఉంటుంది. ఈ కలయిక వల్ల ఐదు రాశులపై ప్రభావం పడి వారి జీవితాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే ఆ ప్రభావం ఉండే రాశులు ఏవో తెలుసుకుందాం.
నాలుగు గ్రహాల కలయిక వల్ల మేషరాశిపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 26 నుంచి ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా జీవితం ఉంటుంది. వ్యాపారులు, ఉద్యోగులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దీంతో ఊహించని దానికంటే ఎక్కువగా ఆదాయాన్ని పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగులు పదోన్నతి పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది.
కుంభ రాశిపై గ్రహాల కలయిక ప్రభావం ఉండనుంది. ఈ రాశి వారు తీసుకునే నిర్ణయాలు వారి జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఉద్యోగులు పెద్ద ఎత్తున ధన లాభం పొందుతారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. బంధువుల నుంచి ప్రేమాభిమానాలు పొందుతారు. అవసరానికి బంధువుల నుంచి ఒకరు డబ్బు సహాయం చేస్తారు. ప్రియమైన వారితో కలిసి ఉంటారు.
మిథున రాశిలో ఫిబ్రవరి 26 నుంచి అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ రాశి వారికి ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు తోటి వారి సహాయంతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాలు చక్కబడుతాయి. అయితే ఈ రాశి వారు ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో పెద్దల సలహా తీసుకోవడం అవసరం. కొత్తగా పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి. కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.
కుంభ రాశిలో నాలుగు గ్రహాలు సంచరించడం వల్ల కర్కాటక రాశిపై ప్రభావం పడుతుంది. ఈ రాశి వారికి మొదటి కొన్ని రోజుల్లో ఇబ్బందులు ఉన్నా.. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడతాయి. గతంలో కంటే ఎక్కువ ఆదాయం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొత్తగా వ్యాపారాలను ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేయడానికి ముందడుగు వేస్తారు. అయితే ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.
కన్యారాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. కొన్ని వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు ఆదాయాన్ని పెంచుకుంటారు. నిరుద్యోగులు ఉద్యోగాన్ని పొందేందుకు మార్గం ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు మొదలవుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.