https://oktelugu.com/

Tirumala : ఆరు రోజుల్లో నాలుగు లక్షల మంది భక్తులు.. తిరుమలలో రద్దీకి కారణం అదే!

వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు నాలుగు లక్షల మంది భక్తులు శ్రీవారిని( Lord Venkateswara) దర్శించుకున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : January 16, 2025 / 10:28 AM IST

    Tirumala

    Follow us on

    Tirumala :  తిరుమలలో( Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. గడిచిన ఆరు రోజుల్లో ఏకంగా నాలుగు లక్షలకు పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఈనెల 19 వరకు తిరుమలలో ఉత్తర ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి. మొన్నటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని దర్శనాలకు సంబంధించి టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. ఏ రోజుకు ఆ రోజు టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇంకోవైపు శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తుండడంతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. ఈనెల 10 నుంచి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 19 వరకు కొనసాగనున్నాయి.

    * ముందు నుంచే సన్నాహాలు
    వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం( Tirumala Tirupati Devasthanam) పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. నెలల ముందు నుంచి సన్నాహాలు ప్రారంభించింది. ముందుగా ఆన్లైన్ టికెట్ల జారీ ప్రక్రియను పూర్తి చేసింది. ఆఫ్లైన్ కు సంబంధించి కొన్ని కేంద్రాల వద్ద టోకెన్ల జారీకి సిద్ధపడింది. అయితే తొక్కిసలాట జరగడంతో ఓ ఆరుగురు భక్తులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తా జాగా టోకెన్ల జారీకి సంబంధించి పటిష్ట ఏర్పాట్లు చేశారు టిటిడి ట్రస్ట్ బోర్డు అధికారులు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టోకెన్ల జారీ ప్రక్రియను చేపడుతున్నారు.

    * ఏ రోజు కా రోజు టోకెన్ల జారీ
    ఈనెల 10,11,12 టోకెన్ల జారీకి సంబంధించి 9న అపశృతి( accident) జరిగింది. అందుకే 13వ తేదీ నుంచి 19 వరకు ఏ రోజు కా రోజు టోకెన్లు ఇచ్చేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం టోకెన్ల జారీకి సంబంధించి కేంద్రాల వద్ద భక్తులు బారులు తీరుతున్నారు. క్యూ లైన్ లో వేచి ఉండడం కనిపిస్తోంది. ఈనెల 18వ తేదీన వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి గురువారం టోకెన్లు జారీ చేస్తున్నారు. ఈ నెల పది నుంచి 15 వరకు ఆరు రోజుల్లో 4.08 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నట్లు టిటిడి అధికార వర్గాలు వెల్లడించాయి.

    * భక్తుల రద్దీ పెరిగే అవకాశం
    అయితే చివరి మూడు రోజులు భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు టిటిడి అధికారులు( TTD officers) అంచనా వేస్తున్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి అయినప్పటికీ.. తిరుమలలో ఒక మోస్తరు గానే భక్తుల రద్దీ కొనసాగింది. ఏకాదశి సందర్భంగా ఉదయం స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈనెల 19 వరకు సంక్రాంతి సెలవులు ఉండడంతో ఎక్కువమంది తిరుమల చేరుకుంటున్నారు. ఈ మూడు రోజులు ఒక్కసారిగా రద్దీ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు టిటిడి అధికారులు.