Makar Sankranti : సంక్రాంతి( Pongal).. తెలుగు ప్రజల పెద్ద పండుగ. ఈ నాలుగు రోజులు ప్రత్యేక పర్వదినాలే( special days). ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది కూడా. భోగితో ప్రారంభమై.. ముక్కనుమతో ముగుస్తుంది పండగ. ఇప్పటికే పండగ సందడి ప్రారంభమైంది. ఎక్కడెక్కడో స్థిరపడిన వారు స్వగ్రామాలకు వస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. బస్సులతో పాటు రైలు కిక్కిరిస్తున్నాయి. వలస జీవులు స్వగ్రామాలకు చేరుకోవడంతో సందడి నెలకొంది. అంతటా సందడి వాతావరణం కనిపిస్తోంది. మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. షాపులు రద్దీగా మారాయి. రేపటి నుంచి పండగ సందడి ప్రారంభం కానుంది.
* భోగ భాగ్యాల భోగి
భోగభాగ్యాల భోగి( Bhogi ) రేపు. ఈ దినానికి ప్రత్యేక స్థానం ఉంది. పిల్లలకు భోగి పళ్ళు పోసి ఆచారం అనాదిగా వస్తోంది. రేగిపండ్లను భోగి పండుగ పోసే ఈ పండుగ భోగి రోజు జరుగుతుంది. చిన్నారులు ప్రజ్ఞావంతులు కావాలని.. తద్వారా సమాజానికి ఉపయోగపడాలన్నది పెద్దల నమ్మకం. అందుకే మేధాశక్తిని పెంచే రేగి పండ్లను, పూలు, చెక్కలు.. సిరికి నిర్వచనమైన రూపాయి బిళ్ళలను, చిల్లరను కలబోసి చిన్నారులకు భోగి పళ్ళు పోస్తారు. ఈ తంతు కారణంగా చిన్నారుల మేధాసంపత్తి సాధిస్తారు అన్నది నమ్మకం. భోగి రోజున ఉదయాన్నే పిల్లలకు తలంటి, పిడకలను భోగిమంటల్లో వేసి.. సాయంత్రం పూట నలుగురిని పిలిచి పండుగ నిర్వహిస్తారు.
* మకర సంక్రమాణం
సంక్రాంతి( Pongal) పర్వదినం అంటేనే.. ప్రత్యేకమైనది. ఒక రాశిలోని సూర్యుడు మరో రాశిలోకి మారే సమయాన్ని సంక్రమణం అంటారు. ఈ మొదటి సంక్రమణాన్ని మకర సంక్రాంతిగా పిలుస్తారు. దక్షిణాది రాష్ట్రాలకు( South India) పొంగల్ గా సుపరిచితమైన పండుగ ఇది. రైతులకు కొత్త పంటను ఇంటికి చేర్చేది కూడా ఇదే పండగ. ఈ పండగ రోజు పితృదేవతలకు పూజల చేయడం ఆనవాయితీ. ప్రత్యేక ఘడియల్లో ఇంటి పెద్దలకు నైవేద్యం పెడితే కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందని ఒక నమ్మకం. రైతులకు అత్యంత ఇష్టమైన పండుగ కూడా సంక్రాంతి. చేతినిండా నగదు ఉంటుంది. మనసుకు హాయినిస్తుంది. పల్లెలు పచ్చగా ఉంటేనే పట్టణాలు బాగుపడతాయి. అందుకే పట్టణాల్లో సైతం సంక్రాంతి సందడి ఉంటుంది.
* పితృదేవతలకు ఆహ్వానం
పితృదేవతలను ఇంట్లోకి ఆహ్వానించి వారిని ఆరాధించే పండుగగా కూడా సంక్రాంతికి( Pongal) గుర్తింపు ఉంది. తమ వంశం నిలబడడానికి కారకులైన పెద్దలను మూలన చేర్చి.. వారికి పంచ, గావంచ, ఇతర దుస్తులతో వారికి పూజలు చేస్తారు. ఏడాది పొడవునా పండించిన కొత్త పంట ధాన్యాన్ని సంక్రాంతి రోజున ఉండి నైవేద్యంగా పెడతారు. అలా వారికి తొలి మొక్కు చెల్లించిన తర్వాత కొత్త పంటను వినియోగిస్తారు. గిరిజనులకు అయితే ఇదో ఆరాధ్యమైన పండుగ. పోడు వ్యవసాయం కొత్త పొటను రాశులుగా పోసి.. చెంచుల సమక్షంతో పెద్దలకు సమర్పించిన తర్వాతే వాటిని తినడం ఆరంభిస్తారు.
* కనుమ ప్రత్యేకత ఇదే
పండుగ పూట కనుమ( Kanuma ) పర్వదినానికి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈరోజు గొబ్బెమ్మకు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో దీన్ని సంఘమయ్యేగా పిలుస్తారు. గొబ్బెమ్మ అంటే గోవు అనే పదానికి చెందినది. అలాగే ఇది ఒక జాతి పుష్పం. ఆవు పేడను ముద్దగా చేసి.. పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. బంతి చామంతి వంటి పూలతో సంగమయ్యను తయారుచేసి.. ఇంటి ముంగిట ముగ్గుల్లో పెట్టి పూజలు చేస్తారు. దీనికి తెల్ల చెరుకు, కొబ్బరి, వడపప్పు, చిలగడి దుంప, కూరగాయలను నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే గొబ్బెమ్మకు మొక్కు తీర్చుకుంటే యువతులకు త్వరగా వివాహాలు, సంతానం కలుగుతుందని పల్లెవాసుల నమ్మకం.