First priestess of India: సాధారణంగా మనం పెళ్లి లేదా ఏవైనా పూజలు దగ్గర పురోహితుడునే చూస్తుంటాం. కానీ పురోహితురాలని చూడటం చాలా అరుదు. అసలు చూడకపోయి ఉంటాం కూడా. ఎందుకంటే పూజారి అంటే కేవలం మగవాళ్లు మాత్రమే ఉండాలి. మహిళలు ఉండకూడదు. ఎందుకంటే మహిళలు నెలసరి అవుతారు. నెలసరి అయ్యే వాళ్లు చేయకూడదని చాలామంది భావిస్తారు. సాధారణంగా కొన్ని దేవాలయాల గర్భగుడిలకు మహిళలకు అనుమతి ఉండదు. దీనికి ముఖ్య కారణం నెలసరి. అయితే సాధారణంగా మనం ఎక్కువగా పెళ్లిళ్లు, అన్నప్రాశనలు, పూజలు, గృహప్రవేశం వంటి కార్యక్రమాలన్నీ పురుషులు చేయడం చూస్తుంటాం. దీనివల్ల పురోహితుడు మాత్రమే ఉంటారు. పురోహితురాలు ఉండరని మనం ఫిక్స్ అయిపోతాం. అయితే మన దేశంలో ఓ పురోహితురాలు ఉంది. కలకత్తాకి చెందిన ఈమె దేశంలోని మొదటి పురోహితురాలు. అసలు ఈమె ఎవరు? ఎందుకు పురోహితురాలుగా చేస్తోంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కలకత్తాకి చెందిన నందిని భౌమిక్ అనే మహిళ పురోహితురాలిగా వ్యవహరిస్తోంది. దాదాపు పదేళ్ల నుంచి ఈమె పురోహితురాలిగా పూజలు, పెళ్లిళ్లు చేస్తుంది. సంస్కృతంలో డాక్టరేట్ చదివిన నందిని కుటుంబ బాధ్యతల కారణంగా ఉద్యోగం చేయలేకపోయింది. ఇంట్లో వాళ్లు ఆమెకి పెళ్లి చేసేశారు. అయితే అంతా బాగానే ఉన్నా.. ఓ సమస్య వచ్చింది. నందినీ రెండవ కూతురికి వివాహం నిశ్చయమైంది. ఆ వివాహానికి ఆమెకు పురోహితుడు దొరకలేదు. పురోహితుడు కోసం ఎంతగానో వెతికారు. కానీ ఫలితం లేదు. దీంతో ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. ఎవరో ఎందుకు నేనే పెళ్లి చేస్తే ఏమవుతుందని భావించింది. దీంతో తన రెండవ కూతురి పెళ్లితో నందిని పురోహితురాలిగా మారింది. అప్పటి నుంచి ఆమె పురోహితురాలిగా వ్యవహరిస్తోంది. అయితే ఆమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని పురుషులతో పాటు మహిళలు కూడా వ్యతిరేకించారు. కానీ అవన్నీ పట్టించుకోకుండా ఆమె ముందుకు వెళ్లారు.
ఇలా దేశంలోని మొదటి పురోహితురాలిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ప్రజలు ఆలోచన విధానంలో మార్పులు తీసుకురావాలని.. దాని కోసం కృషి చేస్తానని ఆమె అంటోంది. అయితే నందినీ చేసే పెళ్లిలో కన్యాదానం చేయరు. ఎందుకంటే స్త్రీలను వస్తువులుగా పరిగణించే వాటిని ఆమె సపోర్ట్ చేయడానికి ఇష్టలేదన్నారు. పెళ్లి కార్యక్రమాన్ని ఒక గంటలో ఆమె పూర్తి చేస్తారు. అయితే పురోహితురాలిగా చేరిన కొత్తలో ఆమె ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అమ్మాయివి నీకెందుకు ఇలాంటివి. మగవారు మాత్రమే పూజలు చేయాలి. మహిళలు ఇలాంటివి చేయకూడదనే మాటలు ఎక్కువగా విన్నారట. కానీ ఎప్పటికైనా దీనిని మార్చాలని ఆమె పట్టుదలతో అందులోనే ఉండిపోయారు. మహిళలు కూడా పురుషులతో ఏం తక్కువ కారని ఆమె అంటోంది. మరి పురుషులు కాకుండా ఒక మహిళ ఇలా పురోహితురాలిగా వ్యవహరిస్తుంది కదా. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కేవలం పురుషుల మాత్రమే పురోహితుడుగా వ్యవహరించాలా? మహిళలు వ్యవహరించకూడదా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.