Rakhi Pournami : ఈ సమయంలో అస్సలు రాఖీ కట్టొద్దు.. ఆరోజు పాటించాల్సిన నియమాలేంటంటే?

రాఖీ పండుగను జరుపుకొనేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. కొంతమందికి తెలియక ఏదో రాఖీ కట్టేశామా.. వచ్చేశామా అన్నట్లు చేస్తుంటారు. కానీ ఇది మంచిది కాదని పండితులు అంటున్నారు. సోదరుడికి రాఖీ కట్టడానికి ముందే హారతి ఇవ్వాలి. లేదా నెయ్యి దీపంతో వాళ్లకు హారతి ఇవ్వాలి. ఆ తర్వాత అతను ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని దేవుడిని కోరుకోవాలి.

Written By: NARESH, Updated On : August 14, 2024 2:43 pm

Rakhi Pournami

Follow us on

Rakhi Pournami : అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముల బంధానికి మనం రాఖీ పండుగను జరుపుకుంటాం. ఎంత దూరం ఉన్నా సరే ఆరోజు తప్పకుండా సోదరుడికి రాఖీ కడతాం. జీవితాంతం తనకు అండగా నిలవాలని కోరుకుంటూ సోదరుడికి రాఖీ కడతారు. ప్రతిఏడాది శ్రావణ పౌర్ణమి రోజు ఈ రాఖీ పండుగను జరుపుకుంటారు. సోదరుల మధ్య ప్రేమకు ప్రతీకగా రాఖీ కడతారు. సోదరుడికి రక్షాబంధన్ కట్టిన తర్వాత వాళ్లను సోదరికి గిఫ్ట్‌లు కూడా ఇస్తారు. జీవితాంతం నిన్ను కాపాడతానని హామీ కూడా ఇస్తారు. ఎప్పటి నుంచో ఇది ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ రాఖీ పండుగను ఈ ఏడాది ఆగస్టు 19న వస్తుంది. సరైన సమయంలో సోదరుడికి ఈరోజు రాఖీ కడితే మంచిదని పండితులు చెబుతున్నారు. మరి రాఖీ ఏ సమయంలో కట్టాలి. రక్షాబంధన్ రోజు పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకుందాం.

ఆగస్టు 19 రాఖీ పౌర్ణమి రోజున భద్రకాలం ఉంది. ఆగస్టు 18వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 2:21 గంటలకు మొదలవుతుంది. తిరిగి ఆగస్టు 19వ తేదీ సోమవారం మధ్యాహ్నం 1:25 గంటలకు ఈ భద్రకాలం పూర్తవుతుంది. ఈ కాలం ముగిసిన వెంటనే రాఖీ కట్టడం మంచిదని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి మీరు మధ్యాహ్నం 1:25 తర్వాత రాఖీ కట్టడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో రాఖీ కడితే సోదరుల మధ్య బంధం మరింత పెరగడంతో ఇద్దరూ ఆనందంగా ఉంటారు.

రాఖీ పండుగను జరుపుకొనేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. కొంతమందికి తెలియక ఏదో రాఖీ కట్టేశామా.. వచ్చేశామా అన్నట్లు చేస్తుంటారు. కానీ ఇది మంచిది కాదని పండితులు అంటున్నారు. సోదరుడికి రాఖీ కట్టడానికి ముందే హారతి ఇవ్వాలి. లేదా నెయ్యి దీపంతో వాళ్లకు హారతి ఇవ్వాలి. ఆ తర్వాత అతను ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని దేవుడిని కోరుకోవాలి. సోదరుడికి బొట్టు పెట్టి రాఖీ కట్టాలి. ఆ తర్వాత స్వీట్లు తినిపించాలి. ఇలా ఒకరినొకరు నోరు తీపి చేసుకున్నాక.. బహుమతులు ఇచ్చుకోవాలి. అలాగే సోదరీలు ఎర్రటి క్లాత్‌లో కుంకుమ, అక్షింతలు, నాణెం పెట్టి కట్టాలి. దీనిని సోదరుడికి ఇవ్వాలి. దీనిని సోదరుడు తన బీరువాలో ఉంచుకుంటే ఆర్థికంగా అతనికి ఎలాంటి సమస్యలు రావని కొందరి నమ్మకం. కానీ చాలామంది కేవలం రాఖీ కట్టి, గిఫ్ట్‌లు ఇచ్చుకుంటారు. ఈ నియమాలు పాటిస్తూ రక్షాబంధన్ జరుపుకుంటే ఇద్దరికీ మంచి జరగుతుందని పండితులు అంటున్నారు.

అయితే రక్షాబంధన్ రోజు కీర్ చేసి ఇస్తే మంచి జరుగుతుందని వేదపండితులు అంటున్నారు. పంచామృతంతో కీర్ చేసి పెళ్లి కాని అమ్మాయిలకు ఇస్తే వాళ్ల జీవితం బాగుంటుందట. పాలు, పెరుగు, తేనె, బెల్లం, డ్రైఫ్రూట్స్ వాటితో కీర్ చేస్తారు. ఈరోజుల్లో చాలా మంది స్వీట్స్ తినిపించుకుంటున్నారు. కానీ సోదరుడికి స్వయంగా సోదరీలే పాయసం, కీర్ చేసి పెట్టేవాళ్లు. స్వీట్స్ కంటే మీ చేతితోనే పాయసం చేసి సోదరుడి నోరు తీపి చేయండి. సోదరికీ సోదరుడిపై ఎంత ప్రేమ ఉందో ఈ పాయసం తెలుపుతుందని భావిస్తారు. అందుకే స్వయంగా సోదరులే తయారు చేస్తారు.