Homeఆధ్యాత్మికంDurga Navratri 2024: దసరా ముందు దుర్గాదేవి నవరాత్రుల్లో ఈ తప్పులు అసలు చేయవద్దు..

Durga Navratri 2024: దసరా ముందు దుర్గాదేవి నవరాత్రుల్లో ఈ తప్పులు అసలు చేయవద్దు..

Durga Navratri 2024: దసరా వచ్చిందంటే చాలా సందడిగా ఉంటాయి కాలనీలు, పల్లెలు, పట్నాలు. ఏ వాడ అయినా సరే దుర్గమ్మ, బతుకమ్మతో నిండుగా కలకల లాడుతుంటాయి. ప్రతి సంవత్సరం మాదిరి ఈ సారి కూడా దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నవరాత్రులు ముగిసిన తర్వాత విజయదశమి పండుగ జరుగుతుంది. అయితే ఈ నవరాత్రులు జరిగే ఉత్సవాల్లో కొందరు దుర్గామాత విగ్రహాన్ని పెట్టి నవరాత్రులు పూజలు చేస్తుంటారు. ఆ తల్లి ఈ రోజుల్లో ఎంతో భక్తితో చేసే పూజలను అందుకుంటుంది.

వినాయక చవితి పూజల మాదిరి ఈ నవరాత్రులు అదే విధంగా దుర్గామాత విగ్రహాలను కూడా ఏర్పాటు చేసి పూజలు చేస్తారు. అయితే ఈ నవరాత్రి ఉత్సవాలు చేయడం మంచిదే కానీ, ఈ సమయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు దుర్గామాతకు కోపం తెప్పిస్తాయి అంటున్నారు పండితులు. అయితే ఈ సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదో ఓ సారి తెలుసుకుందాం. మీరు కూడా ఆ అమ్మవారిని పెడితే కాస్త జాగ్రత్త.

ఈ నవరాత్రులు జుట్టు కత్తిరించుకోవద్దు. అంతేకాదు గుండు చేయించుకోవడం గడ్డం తీయించుకోవడం కూడా మంచిది కాదట. ఇలాంటి వాటి వల్ల ఆ దుర్గాదేవికి కోపం వస్తుందని చెబుతున్నారు పండితులు. అలాగే కలశం ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే మాత్రం దుర్గాదేవికి ఎదురుగా కలశం ఉండాలి. అలాగే అమ్మవారి ఎదుట అఖండ జ్యోతి కచ్చితంగా వెలుగుతూ ఉండాలి. ఈ అఖండ జ్యోతి ని ఎవరు ముట్టుకోవద్దు. అంతేకాదు ఆ జ్యోతి ఆరిపోకుండా చూసుకోవాలి. ఇంట్లో అఖండ జ్యోతిని వెలిగించిన తర్వాత ఇంటికి తాళం వేసి వెళ్లకూడదు. . ముఖ్యంగా దసరా నవరాత్రులలో మాంసాహారం జోలికి వెళ్లవద్దు. మద్యం, మాంసంతో పాటుగా ఉల్లి వెల్లుల్లి అల్లం వంటి మసాల దినుసులను కూడా అసలు వాడవద్దు. నవరాత్రులు జరిగినన్ని రోజులు ఇంట్లో నిమ్మకాయను కోయడం కూడా మంచిది కాదు అంటున్నారు నిపుణుల. ఇలాంటివి చేస్తే ఇంట్లో అరిష్టం కలుగుతుంది.

ఇంట్లో నిమ్మరసం లేకపోతే ఎలా అనుకోవద్దు. ఎందుకంటే నిమ్మకాయ కోయవద్దు కానీ మార్కెట్‌లో దొరికే నిమ్మరసం బాటిల్స్‌ను వాడవచ్చు అంటున్నారు నిపుణులు. తొమ్మిది రోజులపాటు ఉపవాసం ఉండేవారు మధ్యాహ్నం కూడా నిద్ర పోవద్దు. ఇలా చేస్తే ఉపవాస ఫలితం దక్కదట. అంతేకాదు ఉపవాసం ఉండేవారు కొద్ది మొత్తంలో మాత్రమే పండ్లను తీసుకోవాలి. ఉపవాసం ఉండేవారు ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి. దీంతోపాటు నీటిని బాగా తాగాలి. ఉపవాసం ఉంటే ఆలుగడ్డలు తినాలి. కూరగాయలు తినవద్దు అంటున్నారు నిపుణులు. కూరలు చేయకుండా తినాలి.

ఉపవాసం చేయని వారు పాలను కూరగాయలతో కలిపి వండి తింటే చాలా మేలు జరుగుతుంది అంటున్నారు పండితులు. నవరాత్రుల్లో ఉపవాసం చేయని వారు రోటీ, పూరీ, పకోడీ తినాలి. నవరాత్రుల్లో సామ అన్నం సామలు అని పిలచే ఒక రకమైన తృణధాన్యం మార్కెట్‌లో దొరుకుతుంది. దాంతో అన్నం వండి తినడం వల్ల మంచి జరుగుతుంది. నట్స్ ను రోస్ట్ చేయాలి. అందులో నెయ్యి వేసుకుని తినండి. పైన చెప్పిన విషయాలు పాటిస్తే ఆ దుర్గాదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అంటున్నారు నిపుణులు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular