Instagram Reels ; సినిమాల్లో అవకాశాల కోసం లేదా పాపులర్ కావడానికి చాలా మంది రీల్స్ మాయలో పడుతున్నారు. ఆటలు, పాటలు, డ్యాన్స్ లు చేస్తూ కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. వీటి ద్వారా ఫాలోయింగ్ పెరిగితే డబ్బలు సంపాదించవచ్చని కొందరి ఆలోచన. ఒకప్పుడు టిక్ టాక్ యాప్ ఉండగా.. ఇలాగే చాలా మంది వీడియోలు తీశారు. అయితే ఈ యాప్ తొలగించిన తరువాత రీల్స్ చేయడం తగ్గడం లేదు. ఇప్పుడు యూట్యూబ్, ఇతర సోషల్ మీడియాల్లోనూ పోస్టు చేసేందుకు రీల్స్ చేస్తున్నారు. అయితే ఇవి మితిమీరుతున్నాయి. కొందరు పాపులర్ మాయలో పడి ఒంటి మీద దుస్తులు లేకుండా నడుస్తున్నారు. తాజాగా ఓ యువతి లో దుస్తులు వేసుకొని నడి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లింది. ఆ తరువాత ఏం జరిగిందంటే?
నిన్నటి వరకు రీల్స్ అంటే పాటలకు డ్యాన్స్ చేయడం వంటివి చూశాం. కానీ ఇప్పుడు ప్రాణాలకు మించి సాహసం చేస్తూ వీడియోలు తీస్తున్నారు. మిగతా వారి కంటే భిన్నంగా కనిపించాలని పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. చాటు మాటుగా ఈ రీల్స్ చేస్తే ఎవరుచూస్తారులే.. అనుకొని కొందరు నడిరోడ్లపై, జనం తిరిగే ప్రదేశాల్లోనే వీడియోలు తీస్తున్నారు. కొందరు భగ్న ప్రేమికులు తమకు ప్లేస్ దొరకలేదు అన్నట్లుగా.. రోడ్డపైనే బైక్ పై రొమాన్స్ చేస్తున్నారు. మరికొందరు రోడ్లపై ప్రయాణికులకు ఆటంకాలు కలిగిస్తూ వీడియోలు తీస్తున్నారు.
ఇదే కోవలో ఓ యువతి ఒంటిపై సగం దుస్తులు వేసుకొని రీల్స్ తీసింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పట్టణంలో ఇటీవల ఓ యువతి అందరూ ఆశ్చర్యపోయే పని చేసింది. కేవలం లో దుస్తులు వేసుకొని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లింది. రాత్రి సమయంలో ఈ యువతి అలా నడుచుకుంటూ వెళ్లేసరికి అందరూ ఆశ్యర్యపోయారు. కొందరు ఈ ఘోరాన్ని చూడొద్దంటూ కళ్లు మూసుకున్నారు. మరికొందరు మాత్రం ఇలా ఎందుకు చేస్తుందని చూస్తూ ఉండిపోయారు. అయితే ఇదంతా ఆమె కేవలం రీల్స్ కోసమే చేసిందని తేలింది. దీంతో ఈ వీడియోను చూసిన ఆమెను ప్రతి ఒక్కరూ తిట్ల వర్షం కురిపించారు.
కొందరు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రీల్స్ మాయలో పడి ఇలా చేయడం వల్ల సమాజానికి చెడ్డ పేరు వస్తుందని అంటున్నారు. ముఖ్యంగా ఇలాంటి వీడియోలు తీసేవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి చర్యల వల్ల మరికొందరు రీల్స్ మాయలో పడుతారని, అందువల్ల రీల్స్ విషయంలో పోలీసులు చ్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల మరికొందరు రీల్స్ పేరుతో జలాశాలపై దూకి మరణించిన సంఘటనలు ఉన్నాయి. ఇలా రీల్స్ తీసి ప్రాణాలమీదకు తెచ్చుకోవడం తప్ప ప్రయోజనం ఏమీ లేదని అంటున్నారు.
అయితే ఆ యువతి వీడియోపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేయగా ఆమె వెంటనే క్షమాపణలు చెప్పింది. మరోసారి ఇలాంటి వీడియోలు చేయనని తెలిపింది. కానీ ఆ వీడియో అప్పటికే వైరల్ అయింది. దీంతో కొందరు రకరకాల కామెంట్స్ చేశారు. ఆ యువతి చేష్టల వల్ల మిగతా వరు కూడా ఇబ్బందులకు గురవుతారని అన్నారు. ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారుు.
A girl apologizes after her reel wearing obscene clothes while roaming on the streets of Indore went viral on social media.
Your opinion? pic.twitter.com/OloNKM9aqm
— BhUpE DeVv (@Bhupidevv) September 25, 2024
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More