Diwali: హిందూ సంప్రదాయంలో ప్రతి పండుగ చాలా ప్రత్యేకమైనది. వినాయక చవితి మొదలు వచ్చిన ప్రతీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో కుటుంబమంతా కలిపి సంతోషంగా జరుపుకుంటారు. అయితే పండుగల్లో కొన్ని చాలా ప్రత్యేకమైనవి. అలాగే పిల్లలకు నచ్చే కొన్ని పండుగలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో దీపావళి ఒకటి. పిల్లలకు దీపావళి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే టపాసులు కాల్చవచ్చని సంతోషపడతారు. ఈ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు చాలా భక్తితో తప్పకుండా నిర్వహిస్తాయి. దీపావళి పండుగ రోజు కొత్త దుస్తులు ధరించి ముఖ్యంగా లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తారు. అసలు దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారు? దీని వెనుక ఉన్న కారణం ఏంటో పూర్తి వివరాల్లో చూద్దాం.
దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ఆశ్వీయుజ బహుళ చతుర్దశి, నరక చతుర్దశి, అమావాస్య నాడు దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి పండుగ రోజు మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో, నైవేద్యాలు సమర్పించి పూజిస్తారు. ఇలా చేయడం వల్ల సకల బాధలు తొలగి ఆనందంగా ఉంటారని భక్తులు నమ్ముతారు. అయితే అసలు దీపావళి పండుగకి, లక్ష్మీదేవిని పూజించడానికి సంబంధం ఏంటని చాలా మంది సందేహ పడుతుంటారు. అయితే దుర్వాస మహర్షి దేవేంద్రుని ఆతిథ్యానికి పిలిచి ఒక హారాన్ని ఇచ్చాడట. ఇంద్రుడు దాన్ని తన ఏనుగు మెడలో వేస్తే అది ఆ హారాన్ని కాలితో తొక్కేసిందట. దీంతో దుర్వాసుడుకి కోపం వచ్చి సంపదలు పోవాలని దేవేంద్రుని శపిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దీపం వెలిగించి మహాలక్ష్మిని పూజిస్తే.. సిరి సంపదలు వస్తాయనే వరం దేవేంద్రునికి ఇస్తాడు. దీంతో అన్ని పోగొట్టుకున్న దేవేంద్రుడు లక్ష్మీదేవిని పూజించి సిరిసంపదలు అన్నింటిని పొందుతాడు. లక్ష్మీదేవిని భక్తితో పూజించడం వల్ల సిరి సంపదలు కలిగాయని చెప్పుకుంటారు.
లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి రాజ్యము, సంపదలను అన్ని దేవేంద్రుడు పొందిన తర్వాత.. భక్తులకు సంపదలు ఇవ్వమని అడుగుతాడు. దీంతో మహాలక్ష్మీ భక్తితో నన్ను పూజించే వారికి తప్పకుండా అనుగ్రహిస్తానని తెలిపింది. దీంతో భక్తితో లక్ష్మీదేవిని పూజిస్తే.. విజయాన్ని కోరే వారికి విజయలక్ష్మిగా, మహర్షులకు మోక్ష లక్ష్మీగా, విద్యార్థులకు విద్యాలక్ష్మిగా, డబ్బు కోరే వారికి ధన లక్ష్మీ గా అన్ని కోరికలు నెరవేరుస్తానని తెలిపింది. అందుకే దీపావళి రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పండుగ రోజు మహాలక్ష్మిని పూజిస్తే సంపదలు, సుఖసంతోషాలు లభిస్తాయని భక్తులు నమ్మి పూజిస్తారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ పండును చాలా ఘనంగా జరుపుకుంటారు. కొత్త వస్తువులు, కొత్త దుస్తులు ధరించి స్వీట్లు పంచుకుని కుటుంబమంతా కలిసి సంతోషంగా జరుపుకుంటారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉండే పండితులను సంప్రదించడం ఉత్తమం.