https://oktelugu.com/

Diwali 2024: దీపావళికి ఇండియాలో సందర్శించాల్సిన ప్రదేశాలు ఇవే!

ఇండియాలో కొన్ని ప్రదేశాల్లో దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ ప్రదేశాల్లో దీపావళి పండుగను ఒక్కసారి చూస్తే అసలు రెండు కళ్లు సరిపోవు. విద్యుత్ దీపాలతో అంత అందంగా ఉంటుంది. దీపావళి పండుగ నేపథ్యంలో వీటిని కొత్త రంగులతో అలంకరిస్తారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 19, 2024 / 01:51 AM IST

    Diwali 2024

    Follow us on

    Diwali 2024: దేశ వ్యాప్తంగా దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. కుల, మత బేధం లేకుండా అందరూ కూడా దీపావళి పండుగను జరుపుకుంటారు. అయితే దీపావళి ప్రారంభం అవుతుందంటే చాలా ఇక నగరాలన్నీ అందంగా కనిపిస్తాయి. రకరకాల దీపాలు, లైట్లతో అలంకరిస్తారు. రాత్రిపూట ఈ నగరాలను చూడటానికి రెండు కళ్లు కూడా సరిపోవు. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో పండుగకు ప్రత్యేకత ఉంటుంది. అలాగే కొన్ని ప్రదేశాలు ఒక్కో పండుగను ఘనంగా జరుపుకుంటారు. అయితే మన ఇండియాలో కొన్ని ప్రదేశాల్లో దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ ప్రదేశాల్లో దీపావళి పండుగను ఒక్కసారి చూస్తే అసలు రెండు కళ్లు సరిపోవు. విద్యుత్ దీపాలతో అంత అందంగా ఉంటుంది. దీపావళి పండుగ నేపథ్యంలో వీటిని కొత్త రంగులతో అలంకరిస్తారు. ఒక్క దీపావళికి ఈ ప్రదేశాలను సందర్శిస్తే ప్రతీ పండుగను కూడా ఇక ఇక్కడే జరుపుకుంటారు. ఎందుకంటే ఈ ప్రదేశాలు దీపావళి సమయంలో చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఒక్కసారైన దీపావళికి ఈ ప్రదేశాలను సందర్శించాలని అనుకుంటారు. మరి దీపావళికి తప్పకుండా ఇండియాలో సందర్శించాల్సిన ఆ ప్రదేశాలేవో తెలుసుకోవాలంటే ఒక్కసారి పూర్తిగా ఈ ఆర్టికల్ మొత్తం చదివేయండి.

     

    వారణాసి
    దీపావళి పండుగను వారణాసిలో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. గంగా నదీ తీరాన ఎక్కడ చూసిన కూడా అనేక దీపాలు కనిపిస్తాయి. ఈ దీపాలను చూడటానికి అసలు రెండు కళ్లు సరిపోవు. నది ఒడ్డున దీపాలు ఎంతో సుందరంగా ఉంటుంది. లక్షల దీపాలు, గంగా హారతిని చూడటానికి దేశ వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలి వస్తారు. ఇక్కడ ఉన్న ఆలయాన్ని విద్యుత్ దీపాలతో భారీగా డెకరేషన్ చేస్తారు. వీటిని చూడటానికి సగం మంది వెళ్తుంటారు.

    అయోధ్య
    శ్రీరాముడి జన్మస్థలం అయిన అయోధ్యలో దీపావళి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది కాబట్టి ఇంకా ఘనంగా జరుపుతారని భావిస్తారు. సాధారణంగా అయిన ఈ సిటీ మొత్తాన్ని విద్యుత్ కాంతులతో నింపేస్తారు. చూడటానికి బహు అందంగా ఉంటుంది.

    జైపూర్
    జైపూర్‌లో దీపావళి పండుగను ఆటపాటలతో జరుపుకుంటారు. ఇక్కడ రాజభవనాలు, ఉద్యానవనాలు, కోటలు బాగా ఫేమస్. ఇవన్నీ రంగు రంగుల విద్యుత్ దీపాలతో దర్శనమిస్తాయి. సాధారణంగానే జైపూర్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అందులో విద్యుత్ కాంతుల మధ్య చూస్తే ఇంకా.. లోకాన్నే మర్చిపోతారు. ఇక్కడ ఉండే రాజభవనాలను చూడటానికి అసలు రెండు కళ్లు కూడా సరిపోవు. విద్యుత్ కాంతుల మధ్య చాలా అందంగా ఉంటాయి. ఒక్కసారైన వీటిని విద్యుత్ కాంతులతో చూడాలని చాలా మంది అనుకుంటారు.

    ఉదయ్‌పూర్
    రాజభవనాలకు ప్రసిద్ధి చెందిన ఉదయ్‌పూర్‌లో దీపావళి మహోత్సవాలను చూస్తే.. ప్రతీ ఏడాది ఇక్కడే జరుపుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇక్కడ ఆటపాటలతో పాటు ప్రత్యేకమైన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆకాశంలో స్కై ల్యాంప్‌ను కూడా ఇక్కడ వదులుతారు. ఇక్కడ ఉండే చాలా ప్రదేశాలను విద్యుత్ కాంతులతో అందంగా డెకరేట్ చేస్తారు.