Diwali 2024: దీపావళి రోజు ఇలా పూజించారో.. అష్ట ఐశ్వర్యాలు మీ సొంతం

చాలా మందికి దీపావళి పండుగ ఎలా జరుపుకోవాలో సరిగ్గా తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. అయితే దీపావళి పండుగను ఎలా జరుపుకుంటే లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందో పూర్తిగా తెలుసుకుందాం.

Written By: Kusuma Aggunna, Updated On : October 18, 2024 10:58 pm

Diwali 2024

Follow us on

Diwali 2024: చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. అందరూ ఎదురు చూసే దీపావళి పండుగ రానే వస్తుంది. ఈ పండుగ రోజు లక్ష్మీ దేవిని అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. దీపావళి మొదలు అవుతుందంటే వారం రోజుల నుంచే సందడి మొదలు అవుతుంది. టపాసులు కాల్చుతూ ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే దీపావళి పండుగను కొన్ని పద్ధతులు పాటిస్తూ నియమ నిష్టతో పూజ చేయాలి. అప్పుడే లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది. నియమాలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో పూజిస్తేనే లక్ష్మీ దేవి మీ మీద ఉండి అష్ట ఐశ్వర్యాలు సొంతం అవుతాయి. అయితే చాలా మందికి దీపావళి పండుగ ఎలా జరుపుకోవాలో సరిగ్గా తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. అయితే దీపావళి పండుగను ఎలా జరుపుకుంటే లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందో పూర్తిగా తెలుసుకుందాం.

 

ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కొలువు తీరాలంటే దీపావళి రోజు తప్పకుండా లక్ష్మీ దేవిని పూజించాలి. దీపావళి పండుగ రోజు వేకువ జామున లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేసి కొత్త దుస్తులు ధరించి ఇంట్లో దీపం వెలిగించాలి. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు దీపాలు వెలిగించాలి. అయితే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఒక పెద్ద పీఠం తీసుకోవాలి. దీనిపై కొత్త ఎర్రటి క్లాత్‌ను వేసుకోవాలి. దీనిపై కాస్త బియ్యం వేసి కలశం ఏర్పాటు చేయాలి. ఈ కలశాన్ని రాగి చెంబుతో తయారు చేసి అందులో ఐదు మామిడి ఆకులు వేయాలి. కలశంపై కుంకుమతో పూజించి, దాని పక్కన పసుపు గణేష్ బొమ్మను పెట్టాలి. కలశంపై చిన్న లక్ష్మీ దేవి బొమ్మను పెట్టాలి. మొదట గణేశుడికి పూజ చేసి ఆ తర్వాత లక్ష్మీ దేవిని పూజించాలి. ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు అంటున్నారు.

 

దీపావళి రోజు ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో లక్ష్మీ దేవిని పూజించాలి. ఇంటి మొత్తం దీపాలు వెలిగించాలి. వీటిని డైరెక్ట్ అగ్గి పుల్లలతో కాకుండా కొవ్వొత్తితో వెలిగించాలని పండితులు అంటున్నారు. కొందరు ఈ రోజు కొత్త వస్తువులను కొని పూజ చేస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి ఇంట్లో తిష్ట వేసి ఉంటుందని నమ్ముతారు. ఈ రోజు పూజ చేసేవారు ఈ నియమాలు అన్ని పాటిస్తూ చేయడం వల్ల ఎలాంటి బాధలు ఉన్న కూడా తొలగిపోయి సంతోషంగా ఉంటారని పండితులు అంటున్నారు. దీపావళి అంటే చీకటిని తరిమేసి.. వెలుతురుని ఇంట్లోకి తీసుకురావడమే. దీపావళి విజయానికి ప్రతీకగా చెబుతారు. ఎందుకంటే శ్రీరాముడు రావణాసురుడితో యుద్ధం చేసి విజయంలో గెలిచాడు. దీంతో ఆ రోజు దీపావళిని జరుపుకుంటారని చెబుతారు. కాబట్టి ఈ రోజు లక్ష్మీ దేవిని పూజించి జీవితంలో ఉన్న అన్ని కష్టాల నుంచి బయటపడండి.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు పండితుల సలహాలు తీసుకోగలరు.