Diwali 2024 : చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. అందరూ ఎదురు చూసే దీపావళి పండుగ రానే వస్తుంది. ఈ పండుగ రోజు లక్ష్మీ దేవిని అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. దీపావళి మొదలు అవుతుందంటే వారం రోజుల నుంచే సందడి మొదలు అవుతుంది. టపాసులు కాల్చుతూ ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే దీపావళి పండుగను కొన్ని పద్ధతులు పాటిస్తూ నియమ నిష్టతో పూజ చేయాలి. అప్పుడే లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది. నియమాలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో పూజిస్తేనే లక్ష్మీ దేవి అష్ట ఐశ్వర్యాలను ఇస్తుంది. అయితే ఈ దీపావళి పండుగకి ఇంట్లో కొన్ని రకాల మొక్కలను నాటితే ఇంట్లో డబ్బు కొదవ ఉండదని పండితులు అంటున్నారు. మరి దీపావళి పండుగ రోజు ఇంట్లో నాటాల్సిన ఆ మొక్కలేంటో చూద్దాం.
తెల్ల పలాష్
కొందరు ఇంట్లో చాలా కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటివారు తప్పకుండా ఈ తెల్ల పలాష్ మొక్కను ఇంట్లో నాటితే బాధలన్నింటి నుంచి విముక్తి పొందుతారు. ఈ మొక్కను లక్ష్మీదేవి అని కూడా పిలుస్తారు. దీని పువ్వులను లక్ష్మీదేవికి సమర్పించిన కూడా వ్యాధుల బాధ నుంచి బయటపడటంతో పాటు ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుందని పండితులు అంటున్నారు.
క్రాసులా ప్లాంట్
క్రాసులా మొక్కను జెట్ ప్లాంట్ అని కూడా అంటారు. దీన్ని ఇంట్లో నాటడం వల్ల ఐశ్వర్యం, సంపద వస్తాయని పండితులు అంటున్నారు. ఈ క్రాసులా మొక్క డబ్బును ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది.
మనీ ప్లాంట్
ప్రస్తుతం అందరి ఇంట్లో మనీ ప్లాంట్ కనిపిస్తుంది. దీనిని నాటడం వల్ల డబ్బు వస్తుందని నమ్ముతారు. అయితే దీపావళి రోజు ఈ మొక్కను నాటడం వల్ల ఇంటికి ఆనందం, సంపద చేకూరుతుంది. అలాగే మనీ ప్లాంట్ ఇంటిలో ఉండే గాలిని శుద్ధి చేస్తుంది. ఈ మొక్క ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
స్నేక్ ప్లాంట్
స్నేక్ ప్లాంట్‌ను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచితే మంచిదని భావిస్తారు. ప్రధాన ద్వారం వద్ద ఉంచడం వల్ల చెడు శక్తి ఇంట్లోకి రాకుండా రక్షిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా చేయడంతో పాటు ప్రతీ పనిలో విజయాన్ని ఇస్తుంది. ఈ మొక్కను దీపావళికి ఇంట్లో నాటడం వల్ల సుఖసంతోషాలు ఉంటాయి.
తులసి మొక్క
తులసి మొక్క అందరి ఇంట్లో ఉంటుంది. ఈ మొక్క మహావిష్ణువుకు చాలా ఇష్టమైనది. లక్ష్మి దేవికి ప్రతిరూపంగా ఈ మొక్కను కొలుస్తారు. దీన్ని ఇంట్లో దీపావళి రోజు నాటడం వల్ల కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ నియమాలు పాటించే ముందు పండితుల సలహాలు తీసుకోగలరు.