https://oktelugu.com/

Diwali 2024: దీపావళికి ఏ రంగుల దుస్తులు ధరిస్తే.. ఐశ్వర్యం మీ సొంతం అవుతుందో తెలుసా?

దీపావళి పండుగ రోజు కొన్ని రంగుల దుస్తులు ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. మరి దీపావళి పండుగ రోజు ఏ రాశి వారు ఎలాంటి రంగు దుస్తులు ధరిస్తే లక్ష్మీ దేవి సకల సంపదలు, ఐశ్వర్యాన్ని ఇస్తుందో మరి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 18, 2024 / 02:42 PM IST

    Diwali

    Follow us on

    Diwali 2024: అందరూ ఎదురు చూసే దీపావళి పండుగ వచ్చేస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు అయితే టపాసులు కాల్చి చాల ఆనందంగా పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ రోజు లక్ష్మీ దేవిని భక్తితో పూజిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. దీపావళి మొదలు అవుతుందంటే వారం రోజుల నుంచే సందడి మొదలు అవుతుంది. టపాసులు కాల్చుతూ ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే దీపావళి పండుగ రోజు కొన్ని నియమాలు పాటించడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అయితే ముఖ్యంగా పండుగ రోజు కొన్ని రంగుల దుస్తులు ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. మరి దీపావళి పండుగ రోజు ఏ రాశి వారు ఎలాంటి రంగు దుస్తులు ధరిస్తే లక్ష్మీ దేవి సకల సంపదలు, ఐశ్వర్యాన్ని ఇస్తుందో మరి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

     

    దీపావళి పండుగ రోజు అందరూ కొత్త దుస్తులు ధరించి లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుందని భక్తులు నమ్ముతారు. అయితే దీపావళి పండుగ రోజు ఒక్కో రాశి ఒక్కో రంగు దుస్తులను ధరించాలి. మేష రాశి వారు దీపావళి పండుగ రోజు ఎరుపు రంగు దుస్తులను ధరిస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ రాశివారు ఎరుపు రంగు ధరించడం వల్ల ధైర్యం, విశ్వాసంతో ఉంటారు. వృషభ రాశి వారు పింక్ రంగు ధరించడం వల్ల మంచి శుభవార్తలు వింటారు. ద్వి స్వభావ రాశి అయిన మిధునం ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే శ్రేయస్సు లభిస్తుందని పండితులు అంటున్నారు. కర్కాటక రాశి వారు వెండి రంగులో ఉండే దుస్తులను ధరించడం వల్ల స్ట్రాంగ్‌గా ఉంటారని నిపుణులు అంటున్నారు. సింహ రాశి వారు ఊదా రంగు దుస్తులు ఈ పండుగ రోజు ధరిస్తే బాధలు అన్ని దూరం అవుతాయి.

     

    కన్యా రాశి వారు పసుపు రంగు దుస్తులను దీపావళి పండుగ రోజు ధరిస్తే.. లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది. దీనివల్ల వారు జీవితంలో సంతోషంగా ఉండటంతో పాటు చురుకుగా కూడా ఉంటారు. తులా రాశి వారు మెజెంటా లేదా నీలం రంగు దుస్తులు ధరించడం వల్ల ఆనందంగా, ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారు పండుగ పూట నారింజ, ఎరుపు, పసుపు రంగు దుస్తులను ధరించాలి. ఈ రంగు దుస్తులను ధరించడం వల్ల జీవితంలో మీకు కావాల్సిన ప్రేమ దొరుకుతుందట. ధనస్సు రాశి వారు పసుపు రంగు దుస్తులను దీపావళి రోజు ధరించడం వల్ల వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగితాయట. మకర రాశి వారు నీలం రంగు, కుంభ రాశి వారు లావెండర్, మీన రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం వల్ల జీవితంలో ఆనందంగా ఉండటంతో పాటు అష్ట ఐశ్వర్యాలు సొంతం అవుతాయని పండితులు చెబుతున్నారు. కాబట్టి దీపావళి పండుగ రోజు మీ రాశి బట్టి రంగు దుస్తులు ధరించి లక్ష్మీ దేవిని పూజించండి.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. సూచనలు పాటించే పండితులను సంప్రదించండి.