https://oktelugu.com/

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో.. అఘోరాల నృత్యాలు చూశారా.. సాక్షాత్తు పరమశివుడే దిగివచ్చాడేమో.. వైరల్ వీడియో

నెత్తిన జులపాలు.. మెడలో కపాలాలు.. అర్థనగ్నంగా దేహం.. ఒక చేతిలో డమరుకం.. మరొక చేతిలో త్రిశూలం.. హర హర మహాదేవ.. శంభో శంకర అంటూ నినాదాలు.. వాటికి తగ్గట్టుగానే నృత్యాలు.. చూస్తుంటే పరమశివుడే దిగివచ్చాడేమో అన్నట్టుగా అక్కడి దృశ్యాలు.. ఇదీ ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ పరిసర ప్రాంతాల్లో నెలకొన్న భక్తి పారవశ్యం..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 6, 2025 / 10:35 AM IST

    Maha Kumbh Mela 2025

    Follow us on

    Maha Kumbh Mela 2025: జనవరి 13 నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో మహా కుంభమేళ జరగనుంది. ఫిబ్రవరి 26 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి దాదాపు 40 కోట్ల మంది వస్తారని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం విమాన సర్వీసులతోపాటు, 13వేల రైళ్లను నడుపుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతోపాటు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను కూడా భక్తుల సౌకర్యార్థం అందుబాటులో ఉంచినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. భారీగా భక్తులు వచ్చేందుకు ఆస్కారం నేపథ్యంలో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రయాగ్ రాజ్ లో కల్పిస్తున్న సౌకర్యాలపై ముఖ్యమంత్రి యోగి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర బలగాలు కూడా భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం దాదాపు అన్ని శాఖల అధికారులకు ఇక్కడ విధులు కేటాయించింది.

    అఘోరాలు వస్తున్నారు

    జనవరి 13 నుంచి మహా కుంభమేళ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఇప్పటికే అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఈక్రమంలో అఘోరాలు అక్కడికి భారీగా వస్తున్నారు. శివుడిని పోలి ఉన్న వేషధారణలో ఆకట్టుకుంటున్నారు.. విభూది చాలుకుంటూ.. శివుడి నామస్మరణ చేస్తూ.. ఒళ్ళు గగుర్పాటుకు గురి చేసే విధంగా నృత్యాలు చేస్తున్నారు. ఇప్పటికే హిమాలయ పర్వతాల నుంచి అఘోరాలు ప్రయాగ్ రాజ్ ప్రాంతానికి బయలుదేరారు. వారు వెళుతున్న దృశ్యాలను కొంతమంది వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో అప్లోడ్ చేస్తున్నారు. ” ఇంకా కుంభమేళా మొదలు కాలేదు. కానీ సందడి ప్రారంభమైంది.. అఘోరాలు భారీగా వస్తున్నారు. భక్తి పారవశ్యాన్ని మరింతగా పెంచుతున్నారు. శివుడి నామస్మరణ ఆకట్టుకుంటున్నది. వారు విభూది చల్లుతూ లోకం మొత్తం సుభిక్షంగా ఉండాలని కోరుతున్నారు. శివుడికి ప్రణమిల్లుతూ ఆకట్టుకుంటున్నారు. వారు చేస్తున్న పూజలు.. ఆలపిస్తున్న శివుడి గేయాలు అలరిస్తున్నాయి. వారి భక్తి అనన్య సామాన్యంగా ఉంది. ఇంతటి చల్లటి వాతావరణం లోను వారు అర్ద నగ్నంగా రావడం నిజంగా ఆశ్చర్యం అనిపిస్తోందని” భక్తులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. అంతటి శీతల వాతావరణంలోనూ అఘోరాలు ఘోర తపస్సు చేస్తున్నారు. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల ఆసనాలు చేస్తున్నారు. కొందరైతే దేహం మొత్తానికి విభూది పూసుకుని.. ప్రాతకాల సమయంలో శివుని స్మరించుకొని.. చేతిలో శూలంతో నృత్యాలు చేస్తున్నారు. శివుడిని తమలో ఆవాహన కావాలని మంత్రాలు జపిస్తున్నారు. అఘోరాల రాకతో ప్రయాగ్ రాజ్ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.