https://oktelugu.com/

Bheema Wife Hidimbi: కొడుకును, మనువడిని యుద్ధానికి పంపిన వీరనారి హిడింబి.. భీముని భార్య చరిత్ర తెలుసా?

హిడింబీలు రాక్షస గుణాలు కలిగిన వారు. వీరు తమ ఆకలిని తీర్చుకోవడానికి మనుషులను చంపేస్తారు. పాండవుల ఉనికిని గమనించి ఆ ప్రాంత రాజు హిడింబా తన సొదరి అయినా హిడింబిని పంపుతూ వారిని తమ ఉచ్చులోకి వచ్చేలా ప్లాన్ వేయాలని పంపిస్తాడు.

Written By:
  • Srinivas
  • , Updated On : April 20, 2024 / 12:07 PM IST

    Hidimbi storys

    Follow us on

    Bheema Wife Hidimbi: సమాజంలో స్త్రీకి ప్రత్యేక స్థానం ఉంది. ఆదిశక్తిగా కొలిచే అపురూపమైన ఈ జన్మ.. అందంగా అలరిస్తూనే.. ఆపద సమయంలో ఆదుకుంటూనే.. అవసరానికి త్యాగానికైనా సిద్ధంగా ఉంటుంది. స్త్రీ ఏదైనా చేయాలని సంకల్పించుకుంటనే ఖచ్చితంగా చేయగలదు. అలాగే ఒక వ్యక్తి విజయానికి, పరాజయానికి ఆడవారే వెనక ఉంటార్న విషయం కూడా మనకు తెలియంది కాదు. స్త్రీ శక్తి గురంచి పురాణాల నుంచి ఎన్నో కథలు విన్నాం. కానీ మహాభారతంలో ద్రౌపదికి జరిగిన అవమానంతో స్త్రీ అణిచివేయబడుతుంది అని తెలుస్తుంది. అయితే ఇదే కాలంలో కొందరు వీరనారీమణులు కూడా ఉన్నారన్న విషయం చాలా మందికి తెలియదు. పాండవుల్లో ఒకరైన భీముడు గురించి చాలా మంది చదివే ఉంటారు. ఈయన భార్య హిడింబి అని కొంత మందికి తెలుసు. కానీ ఈమె భీముడిని ఎలా పెళ్లి చేసుకుంది? ఎలాంటి పరిస్థితుల్లో వీరు ఒక్కటయ్యారు? అనే ఆసక్తికర కథనం మీకోసం..

    పాండువులు సౌమ్యులు. హిడింబి వంశస్తులు రాక్షక గుణాలు కలిగిన వారు. అయితే పాండవులు వీరిని విచిత్ర పరిస్థితుల్లో కలుసుకుంటారు. మహాభారతంలో పాండవులను అంతమొందించాలని దుర్యోధనుడు పన్నిన కుట్ర గురించి అందరికీ తెలిసిందే. దీంతో పాండవులను వారణావతం అనే ప్రాంతంలో దుర్యోధనుడు ఉంచతాడు. ఇక్కడ వారికి ఒక ఇల్లు నిర్మిస్తాడు. అయితే దీనిని లక్క మట్టి నెయ్యితో తయారు చేస్తారు. ఎందుకంటే ఒక్కసారి ఈ ఇంటికి అగ్గి అంటిస్తే మొత్తం కాలిపోతోంది. ఈ విషయాన్ని విధురుడు పాండవులకు చేరవేరుస్తాడు.

    దీంతో భీమడు తన భుజబలంతో లక్కమట్టి ఇంటి నుంచి ఒక పెద్ద సొరంగం తవ్వుతాడు. ఆపద వస్తే ఇందులో నుంచి తన కుటుంబ సభ్యులను చేరవేయాలని అనుకుంటాడు. అనుకున్నట్లుగానే ఒక రోజు పాండవుల ఇంటికి అగ్గి అంటుకుంటుంది. దీంతో భీముడు తోటి పాండవులతో కలిసి ముందే తవ్విన సొరంగ మార్గం ద్వారా బయటపడుతారు. అయితే ఈ మార్గం ఒక దట్టమైన అడవిలోకి వెళ్తుంది. వీరు వెళ్లిన ప్రదేశంలో హిడింబీలు నివసిస్తారు.

    హిడింబీలు రాక్షస గుణాలు కలిగిన వారు. వీరు తమ ఆకలిని తీర్చుకోవడానికి మనుషులను చంపేస్తారు. పాండవుల ఉనికిని గమనించి ఆ ప్రాంత రాజు హిడింబా తన సొదరి అయినా హిడింబిని పంపుతూ వారిని తమ ఉచ్చులోకి వచ్చేలా ప్లాన్ వేయాలని పంపిస్తాడు. దీంతో పాండవులు ఉన్న చోటుకు హిడింబి వెళ్తుంది. అయితే అక్కడ అందమైన స్వరూపం కలిగిన పాండవులను చూసి హిడింబి ఆశ్చర్యపోతుంది. వీరిలో భీముడిని బాగా ఇష్టపడుతుంది. దీంతో హిడింబి తన రూపాన్ని మార్చుకొని వారి వద్దకు వెళ్లి అసలు విషయం చెబుతుంది. భీముడిని పెళ్లి చేసుకుంటానని అంటుంది. కానీ వారు నమ్మరు.

    ఇంతలోనే అక్కడికి ఆ ప్రాంత రాజు హిడింబా తన అనుచరులతో కలిసి యుద్ధానికి వస్తాడు. ఈ యుద్ధంలో హిడింబా చనిపోతాడు. దీంతో ఆయన సోదరి అయిన హిడింబి తనను క్షమించమని భీముడిని శరణు కోరుతుంది. అయితే భీముడు తన తల్లిదగ్గరికి హిడింబిని తీసుకెళ్లడంతో వారిద్దరికి పెళ్లి చేస్తారు. వీరికి ఘటోత్కచుడు అనే కుమారుడు పుడుతాడు. ఘటోత్కచుడిని భీముడిలాగే పెంచుతుంది. పాండవులకు ఎలాంటి కష్టం వచ్చినా ఘటోత్కచుడిని పంపిస్తుంది. ఆ తరువాత ఓ రాక్షస కన్యతో పెళ్లి చేస్తుంది. ఘటోత్కచుడికీ బార్బరికుడు అనే కుమారుడు జన్మిస్తాడు.

    బార్జరికుడికి యుక్త వయసు రాగానే విలువిద్యలు నేర్చుకుంటాడు. తన మూడు బాణాలతో అందరినీ చంపేయగల శక్తివంతుడిలా తయారవుతాడు. ఇలాంటి సమయంలో కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనాలని ఘటోత్కచుడికి పిలుపు వస్తుంది. ఈ యుద్దానికి కుమారుడు బార్బరీకుడితో కలిసి వెళ్తాడు. అయితే ఇక్కడ బార్బరీకుడి బలాన్ని చూసిన శ్రీకృష్ణుడు అతడి తలను శ్రీకృష్ణుడు కోరుతాడు. మరోవైపు ఘటోత్కచుడు యుద్ధం చేస్తూ మరణిస్తాడు. ఇలా ఇద్దరు చనిపోయిన విషయం తెలుసుున్న హిడింబి ఎంతో బాధపడుతుంది. కానీ తమ వారు యుద్ధంలో చనిపోయారని గొప్పగా ఫీలవుతుంది.