Homeఆధ్యాత్మికంBhadrapada Purnima Vrat 2024: విష్ణువుకే శాప విముక్తి కల్పించిన వ్రతం.. ఈ రోజు చేయవలసినవి,...

Bhadrapada Purnima Vrat 2024: విష్ణువుకే శాప విముక్తి కల్పించిన వ్రతం.. ఈ రోజు చేయవలసినవి, చేయకూడనివి ఇవీ..

Bhadrapada Purnima Vrat 2024: భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమికి హిందు సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు మహావిష్ణువు రూపమైన సత్యనారాయణ స్వామిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఇదే రోజు ఉమా మహేశ్వర ఉపవాసం కూడా చేస్తారు. చంద్రుడిని కూడా పూజిస్తారు. ఈ పౌర్ణమి నుంచే పిత్రుపక్షం ప్రారంభం అవుతుంది. పౌర్ణమి రోజు పితృ దేవతలకు అర్ఘ్యం ఇవ్వడం, గోవులకు అవిసెలు పెట్టడం శుభ ఫలితం ఇస్తుందని భక్తుల నమ్మకం. సత్యనారాయణ స్వామిని ఆరాధించడం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. అందుకే పౌర్ణమి రోజు తీర్థాలు, కొలనులు, చెరువులు, నదీ స్నానాలు చేస్తారు. సత్యనారాయణ వ్రతం ఆచరించి ప్రసాదం సమర్పిస్తారు. సత్యనారాయణ కథ విన్న తర్వాత ప్రసాదం స్వీకరిస్తారు.బ్రాహ్మణులకు వస్త్రదానం చేస్తారు.

చంద్రారాధన..
విష్ణువుకు పూజ పూర్తయిన తర్వాత, కలశ జలాన్ని చంద్రునికి సమర్పించండి మరియు అతని గౌరవార్థం మంత్రాలను జపించాలి. కర్మలు పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు మరియు హాజరైన ఇతరులకు ప్రసాదాన్ని పంచాలి.

ఉమా మహేశ్వర వ్రతం కూడా..
ఇదే రోజు ఉమా మహేశ్వర వ్రతం కూడా చేస్తారు. భాద్రపద పూర్ణిమ రోజు మహిళలు ఉపవాసం చేస్తారు. ఇది చాలా మంచిదని భావిస్తారు. దీర్ఘ సుమంగళీ ప్రాప్తం పొందుతారని నమ్ముతారు. సత్సంతానం కలుగుతుందని విశ్వాసం. ఉమా మహేశ్వర వ్రతంలో భాగంగా శివపార్వతి విగ్రహాన్ని లేదా పటాన్ని పూజగదిలో ఉంచి దీపం, ధూపం అత్తరు, పువ్వులు సమర్పించాలి. స్వచ్ఛమైన నెయ్యితో చేసిన నైవేద్యం సమర్పించాలి.

విష్ణువుకు శాప విముక్తి..
మత్స్య పురాణం ప్రకారం.. ఒకసారి దుర్వాస మహర్షి శంకరుని దర్శనం చేసుకుని వస్తుండగా మార్గమధ్యంలో శ్రీమహావిష్నువు కలుస్తాడు. శివుడు ఇచ్చిన బిల్వ మాలను ఆయనకు కానుకగా ఇస్తాడు. విష్ణువు దానిని గరుడ మెడలో వేస్తాడు. అది చూసి దుర్వాస మహర్షి కోసంతో విష్ణువును శపించాడు. శివుడిని అగౌరవ పర్చినందుకు మహాలక్ష్మి నుంచి దూరమవుతారని శపిస్తాడు. శేష నాగు కూడా సహకరించదని పేర్కొంటాడు. దీంతో మహావిష్ణువు శాప విముక్తి తెలపాలని కోరతాడు. అప్పుడే ఉమా మహేశ్వర వ్రతం ఆచరించాలని సూచిస్తాడు. దీంతో విష్ణువు ఈ వ్రతం ఆచరించి శాప విముక్తి పొందుతాడు.

పూర్ణిమ సమయం..
భాద్రపద పూర్ణిమ ఉపవాసం: మంగళవారం, సెప్టెంబర్‌ 17, 2024
ఉపవాస రోజున శుక్ల పూర్ణిమ చంద్రోదయం: సాయంత్రం 06:03
ఉదయ వ్యాపిని భాద్రపద పూర్ణిమ: బుధవారం, సెప్టెంబర్‌ 18, 2024
పూర్ణిమ తిథి ప్రారంభం: సెప్టెంబర్‌ 17, 2024న ఉదయం 11:44
పూర్ణిమ తిథి ముగుస్తుంది: సెప్టెంబర్‌ 18, 2024న ఉదయం 08:04 గంటలకు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular