https://oktelugu.com/

Astrology: ఈ రాశులపై శనీశ్వర అనుగ్రహం.. ఇక వద్దన్నా డబ్బు..

కుంభ రాశిలోకి శనీశ్వరుడి రాకతో వృషభ రాశి వారికి జీవితంలో మార్పులు రానున్నాయి. ఈ రాశి గల వ్యక్తులకు శనీశ్వరుడి అనుగ్రహంగ ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : April 27, 2024 / 03:26 PM IST

    Shaniswara Horoscope

    Follow us on

    Astrology:నవగ్రహాల్లో కర్మ ఫలదాత అయిన శనీశ్వరుడు దాదాపు ప్రతీ వ్యక్తి జీవితంలో ఉంటాడు. వ్యక్తుల తప్పులను సరిదిద్దుతూ వారిని సక్రమ మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. అయితే కొందరి జీవితాల్లో శని ప్రవేశం వల్ల వారు కష్టాల పాలవుతారు. ఎన్నో ఇబ్బందులు పడుతూ జీవితాన్ని గడిపేస్తుంటారు. ఈ క్రమంలో వారు పరిహారం కోసం శనీశ్వరుడని ఆరాధిస్తారు. ప్రతీ శనివారం శనిదేవుడిని ఆరాధించడం వల్ల బాధలు తొలగిపోతాయని కొందరు జ్యోతిష్యులు చెబుతారు. అయితే శనీశ్వరుడు తన సొంత స్థానమైన కుంభ రాశిలో సంచరించనున్నాడు. ఇప్పటి నుంచి 2025 వరకు ఈ రాశిలోనే సంచరిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు ఉండనున్నాయి.

    కుంభ రాశిలోకి శనీశ్వరుడి రాకతో వృషభ రాశి వారికి జీవితంలో మార్పులు రానున్నాయి. ఈ రాశి గల వ్యక్తులకు శనీశ్వరుడి అనుగ్రహంగ ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఏ పని చేయాలనుకున్నా.. వెంటనే పూర్తవుతుంది. డబ్బుకు కొదవ ఉండదు. భవిష్యత్ లో ఆర్థికంగా వృద్ధి సాధిస్తారు. వ్యాపారుల పెట్టుబడులు లాభిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

    ఈనెల నుంచి శనీశ్వుడి ప్రభావం సింహ రాశిపై కూడా ఉంటుంది. ఏళ్ల నాటి శని ఇప్పుడు తొలగిపోతుంది. ఇంతకాలం వివాహం కోసం ఎదురుచూసేవారికి త్వరగా వివాహం అవుతుంది. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు ఉన్నా అవి లాభదాయకంగానే ఉంటాయి. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. వివిధ మార్గాల నుంచి డబ్బు వస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

    శనీశ్వుడి అనుగ్రహం పై రెండు రాశులపై అధికంగా ఉండడం వల్ల వారి జీవితం సంతోషంగా ఉంటుంది. అయితే శనీశ్వరుడి చేత పీడించబడుతున్న వారు ఆ స్వామి అనుగ్రహం కోసం శనీశ్వర ఆలయంలో ప్రతీ శనివారం తైలాభిషేకం చేయాలి. నల్ల నువ్వులతో అభిషేకం చేయాలి. నల్లటి దుస్తులు సమర్పించడం వల్ల ఆ స్వామి అనుగ్రహం పొందుతారు. అలాగే శనీశ్వరుడిని కొలవడం వల్ల ఆయన బాధల నుంచి విముక్తి పొందుతారు.