Homeఆధ్యాత్మికంVinayaka Chavithi 2024: వినాయక చవితికి సిద్ధమవుతున్నారా.. విగ్రహం పెట్టాలనుకుంటున్నారా.. ఈ నిబంధనలు తెలుసుకోండి

Vinayaka Chavithi 2024: వినాయక చవితికి సిద్ధమవుతున్నారా.. విగ్రహం పెట్టాలనుకుంటున్నారా.. ఈ నిబంధనలు తెలుసుకోండి

Vinayaka Chavithi 2024: హిందువుల ఆది దేవుడు వినాయకుడు. అన్నిదేవుళ్ల కన్నా ముందు పూజలు అందుకునేది గణనాథుడే. ఏటా భాద్రపద శుద్ధ చవితి నుంచి తొమ్మిది రోజులపాటు హిందువులు గణనాథుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దేశ వ్యాప్తంగా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక వేడుకలను ప్రశాంతంంగా నిర్వహించుకునేందుక పోలీసులు, అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. దేశ వ్యాప్తంగా వినాయక విగ్రహాలు కూడా సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే చాలా మంది మండపాల నిర్వాహకులు ఆర్డర్‌ ఇస్తున్నారు. మండపాలను సిద్ధం చేస్తున్నారు. తొమ్మిది రోజుల పండుగను ఉన్నంతలో ఘనంగా నిర్వహించేందకు గణేశ్‌ ఉత్సవ మండళ్లు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో వినాయక మండపాల ఏర్పాటు.. ఉత్సవాల నిర్వహణపై పోలీసులు సూచనలు చేస్తున్నారు. నిబంధనలు అందరూ పాటించి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో భారీ గణనాథుడు కూడా తుది రూపు దిద్దుకుంటున్నాడు.

మండపాలకు అనుమతి తప్పనిసరి..
వినాయక చవితి సందర్భంగా గణేశ్‌ మండపాలు పెట్టేందుకు అనుమతులు తప్పనిసరని పోలీసులు, అధికారులు స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పొల్యూషన్‌ బోర్డులు జారీ చేసిన నిబంధనలను అందరూ పాటించాల్సిందేనని పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హితంగా వేడుకలను నిర్వహించుకోవాలని తెలిపారు. విగ్రహాల తయారీ, అలంకరణలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ని వాడొద్దని సూచించారు. పీవోపీ విధానంలో అలంకరణ, ఇతర ప్రక్రియలను నిర్వహించొద్దని పేర్కొంటున్నారు. చెరువులు, కాలువలు కలుషితం కాకుండా విగ్రహం పెట్టిన చోటే నిమజ్జనం చేసే విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. వాయు, శబ్ద, జల కాలుష్యం లేకుండా వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరుతున్నారు. మండపాలకు అనుమతులు జారీ చేసేందుకు కలెక్టరేట్‌లో సింంగిల్‌ విండో డెస్కు ఏర్పాటు చేస్తున్నామన్నామని తెలిపారు.

నిమజ్జనం తేదీ తెలపాలి..
ఇక మండపాల అనుమతులు తీసుకునే నిర్వాహకులు అదే రోజు నిమజ్జనం తేదీని కూడా తెలుపాల్సి ఉంటుంది. వాహనాలు, ప్రజలు తిరిగే రోడ్లపై మండపాలు పెట్టడానికి వీల్లేదని, ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ కలిగించకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. నిమజ్జనం సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. విగ్రహాలు తయారు చేసే యూనిట్లను అధికారులు సందర్శించాలని, అక్కడ పరిస్థితులను పరిశీలించాలని చెప్పారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular