హిందూ శాస్త్రం ప్రకారం ప్రతి పండుగలకు, పర్వదినాలకు ప్రత్యేకత ఉంటుంది. పర్వదినాల రోజున కూడా కొన్ని పూజలు చేయాల్సి ఉంటుంది. ఇలా పూజలు చేయడం వల్ల ఎన్నో ఏళ్ల ఫలితాలు పొందవచ్చు. అంతేకాకుండా అనేక ఆర్థిక లాభాలను కూడా రాబట్టుకోవచ్చు. ఇలాంటి పర్వదినాల్లో అక్షయ తృతీయ ఒకటి. అక్షయ తృతీయ రోజున శ్రీమహావిష్ణువు, శ్రీలక్ష్మికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈరోజు శుభకార్యాలు నిర్వహించుకుంటారు. అలాగే ఈరోజు బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని కొందరు నమ్ముతారు. అయితే ఆ లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ముందుగా ఇల్లు శుభ్రంగా ఉండాలి. అంతేకాకుండా అక్షయ తృతీయ రోజున కంటే ముందు రోజు ఇంట్లోనే ఈ వస్తువులను తీసివేయాలి. ఇంతకీ ఏ వస్తువులను తీసివేయాలి అంటే?
Also Read : అక్షయ తృతీయ రోజు వీరు బంగారం కొనుగోలు చేస్తే.. లక్కు లో పడ్డట్లే..
లక్ష్మీదేవి ఏ ఇంట్లోకి ఆహ్వానించాలి అనుకున్న.. ఆ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తాచెదారం ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు అడుగుపెట్టదు. అంతేకాకుండా స్వచ్ఛత పరిశుభ్రత పాటించే ఇంట్లోకి లక్ష్మీదేవి ఎంట్రీ ఇస్తుంది. అయితే స్వచ్ఛత శుభ్రత పాటించాలంటే ఏం చేయాలి? ఎటువంటి వస్తువులను తీసివేయాలి?
చీపురు:
ఒక ఇంట్లోని చీపురుని లక్ష్మీదేవితో సమానంగా కొలుస్తారు. చీపురు ఇంట్లోని చెత్తాచెదాలని శుభ్రం చేస్తుంది. అలాగే చీపురును లక్ష్మీదేవిగా భావించి ఎక్కడపడితే అక్కడ ఉంచరాదు. ముఖ్యంగా నైరుతిలో అసలుకే ఉంచరాదు. అయితే అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ఈ చీపురు పాడైపోయి ఉండకూడదు. ఒకవేళ అప్పటికే పాడైపోయిన చీపురు ఉంటే దానిని వెంటనే తీసివేయాలి. దాని స్థానంలో కొత్త చీపురును కొనుగోలు చేయాలి. అయితే శనివారం రోజున కొత్త చీపురును కొనుక్కోలు చేయవద్దు. మిగతా రోజుల్లో మాత్రమే కొనుగోలు చేయాలి.
విగ్రహాలు:
కొందరి ఇళ్లల్లో దేవతలను పూజించడానికి విగ్రహాలు ఉంటాయి. అయితే ఈ విగ్రహాలు ఎప్పటికీ పూజలు అందుకుంటాయి. అందువల్ల ఇవి బాగున్నాయా? లేదా? చూసుకోవాలి. ఇంట్లో విరిగిపోయిన విగ్రహాలు ఉంటే లక్ష్మీదేవి అడుగు పెట్టదు. అంతేకాకుండా చిరిగిపోయిన బట్టలు దుస్తులు ఉన్నా కూడా లక్ష్మీదేవి ఇంటివైపు కూడా చూడదు అని అంటున్నారు. అందువల్ల ఇంట్లో ఏవైనా విరిగిపోయిన విగ్రహాలు లేదా పగిలిపోయిన చిత్రపటాలు ఉంటే వెంటనే వాటిని బయట పడేయడం మంచిది.
కుర్చీలు:
ప్రతి ఇళ్లల్లో దాదాపు కుర్చీలు ఉంటాయి. కానీ ఇవి సక్రమంగా ఉంటేనే ఇల్లు అందంగా ఉంటుంది. కొందరి ఇళ్లల్లో విరిగిపోయిన కుర్చీలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇలా విరిగిపోయిన కుర్చీలు ఉండడం ఎంత మాత్రం మంచిది కాదు. విరిగిపోయిన లేదా పగిలిపోయిన కుర్చీలు ఉండడం వల్ల ఇంట్లో ఎప్పటికీ అరిష్ట ఉంటుంది. అంతేకాకుండా నెగటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది. అందువల్ల విరిగిపోయిన కుర్చీలు ఉంటే అక్షయ తృతీయ కంటే ఒకరోజు ముందు వాటిని బయట పడేయండి.
అద్దాలు:
రోజు తెల్లవారి లేవగానే స్థానం చేసిన తర్వాత అద్దాన్ని చూసుకుంటూ ఉంటారు. అయితే ఈ అద్దం పగిలినది ఉండకూడదు. పగిలిన అద్దం ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి. అంతేకాకుండా నెగటివ్ వాతావరణం ఏర్పడి అన్ని సమస్యలే ఉంటాయి. అందువల్ల పగిలిన అద్దాలు ఉంటే వెంటనే వాటిని బయటపడేయండి.