https://oktelugu.com/

Akshaya Tritiya:  అక్షయ తృతీయ రోజు ఇవి కొంటే.. రాహువు వెంబడిస్తాడు..!

అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయడం ఎంత మంచిదో.. కొన్ని లోహలు కొనుగోలు చేయడం అంత దరిద్రం అని కొందరు పండితులు చెబుతున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 4, 2024 / 12:44 PM IST

    akshya tritiya

    Follow us on

    Akshaya Tritiya:  హిందూ క్యాలెండ్ ప్రకారం అక్షయ తృతీయను ప్రత్యేకంగా చెప్పుకుంటాం. ప్రతీ సంవత్సరంలో వైశాఖ మాసంలో శుక్లపక్షం రోజున అక్షయ తృతీయను జరుపుకుంటారు. 2024 సంవత్సంలో మే 10న అక్షయ తృతీయ రానుంది. ఈరోజున మహాలక్ష్మీ అమ్మవారిని ప్రత్యేకంగా పూజించడం వల్ల సిరి సంపదలు కురుస్తాయని పురాణాలను బట్టి తెలుస్తోంది. పద్మ పురాణంలో అక్షయ తృతీయ గురించి వివరించారు. ఈరోజున శుచి, శుభ్రతను పాటిస్తూ అమ్మవారిని కొలవడం వల్ల అంతా మంచే జరుగుతంది. అయితే ఈరోజు కొన్ని పనులు పొరపాటున కూడా చేయొద్దు. అలా చేయడం వల్ల రాహువు వెంబడిస్తారని అంటున్నారు.

    అక్షయ తృతీయ రోజున గ్రాము బంగారం అయినా కొనుగోలు చేయాలని అంటారు. బంగారం కొనలేని వారు వెండి అయినా కొనుగోలు చేయొచ్చని అంటున్నారు. బంగారంలో మహాలక్ష్మి కొలువై ఉంటుందని ఉంటుందని, అందుకే ఈరోజున బంగారం కొనుగోలు చేస్తే అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించిన వారవుతారని అంటున్నారు. అందువల్ల బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. దీంతో జువెల్లరీ షాపులన్నీ ఈరోజు కిటకిటలాడుతాయి.

    అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయడం ఎంత మంచిదో.. కొన్ని లోహలు కొనుగోలు చేయడం అంత దరిద్రం అని కొందరు పండితులు చెబుతున్నారు. ఈరోజు ప్లాస్టిక్, అల్యూమినియం లేదా స్టీర్ పాత్రలను అస్సలు కొనుగోలు చేయకూడదట. ఎందుకంటే ఈ వస్తువులు రాహువును ప్రభావితం చేస్తాయి. ఈ పాత్రలను అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేస్తే రాహువును ఇంటికి ఆహ్వానించినట్లేనని అంటున్నారు.

    అలాగే ఈరోజు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఇతరులకు అప్పుగా ఇవ్వకుండా ఉండాలి. బంగారం ఆభరణాలను జాగ్రత్తగా చూసుకోవాలి. పొరపాటున కూడా ఇవి మిస్ కాకుండా చూసుకోవాలి. ఇక ఈరోజు సాయత్రం చీపురుతో ఇల్లును ఊడ్చవద్దు. ఇంటిని ఎప్పటికప్పుడు క్లాత్ లేదా ఇతర వాటితో శుభ్రంగా ఉంచుకోవాలి. ధూళి ఉన్న ఇంట్లోకి లక్ష్మీ అడగుపెట్టదు. అందువల్ల శుభ్రతను తప్పనిసరిగా పాటించాలి.