Puri Ratna Bhandagar : ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. 46 ఏళ తర్వాత రత్న భాండాగారాన్ని అధికారులు 46 ఏళ్ల తర్వాత మళ్లీ తెరిచారు. జగన్నాథుడి సేవలకు ఆటంకం కలుగకుండా భాండాగారాన్ని తెరిచారు. అందులోని ఆభరణాలు, విలువైన వస్తువులను లెక్కించనున్నారు. ఈ నిధిని తరలించేందుకు అధికారులు చెక్క పెట్టెలను సిద్ధం చేశారు.
మొరాయించిన తాళం..
రత్న భాండాగారం తెరిచేందు 11 మంది అధికారుల బృందం వెళ్లింది. భాండాగారం తలుపులు తెరిచేందుకు కమిటీ సభ్యులు గదికి వెళ్లారు. తాళాన్ని తెరిచే బృందాన్ని వెంట తీసుకెళ్లారు. అయితే తాళం చాలాసేపు తెరుచుకోలేదు. దీంతో తాళాలు తెరిచే బృందం దాదాపు 15 నిమిషాలు శ్రమించి ఓపెన్ చేసింది. సరిగ్గా ఆదివారం(జూలై 14న) మధ్యాహ్నం 1:25 గంటలకు రత్న భాండాగారం తలుపులు తెరుచుకున్నాయి.
స్నేక్ క్యాచ్ బృందం..
ఇక రత్నా భాండాగారంలో పాములు ఉన్నట్లు ప్రచారం జరగడంతో కమిటీ తమ వెంట స్నేక్ క్యాచక్ బృందాన్ని కూడా తీసుకెళ్లింది. గది తెరిచిన తర్వాత అక్కడ సర్పాలు ఉన్నట్లు ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. అయితే ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే స్నేక్ క్యాచర్లను తీసుకెళ్లారు.
భారీగా నిధి..
ఇక రత్న భాండాగారంలో భారీగా నిధి ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ సుమారు లక్ష కోట్ల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. దీనిని తరలించేందుకు అధికారులు చెక్క పెట్టెలను తెప్పించారు. ప్రత్యేక బాక్సుల్లో గట్టి బందోబస్తు మధ్య నిధిని తరలించి లెక్కించేందకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నిష్టగా సిబ్బంది..
ఇదిలా ఉంటే పూరీ జగన్నాథుడి రత్న భాండాగారంలోని గదిని తెరిచే సిబ్బంది వారం రోజులుగా నిష్టగా ఉంటున్నారు. మద్యం, మాంసం తీసుకోకుండా దైవనామస్మరణలోనే ఉన్నారు. భక్తుల విశ్వాసాలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు అన్నిరకాల చర్యలు తీసుకున్నారు. అయితే భాండాగారం తలుపులు తెరిచేంత వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేశారు.
స్పృహ తప్పిన ఎస్పీ..
ఇదిలా ఉంటే.. రత్న భాండాగారం గదిని తెరిచేందుకు చాలా సమయం పట్టింది. దీంతో కమిటీ వెంట కలెక్టర్, ఎస్పీ కూడా వెళ్లారు. లోపల ఉక్కపోత, చెమటగా ఉండడంతో ఎస్పీ స్పృహ తప్పారు. దీంతో సిబ్బంది ఎస్పీని బయటకు తీసుకొచ్చారు. కాసేపటి తర్వాత కోలుకున్నారు.
జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ సిఫారసులతో..
శ్రీజగన్నాథ ఆలయ చట్టం ్ర‘పకారం ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌కు కట్టుబడి స్వామి వారి రత్నాభాండాగారం గదిని తెలిచామని కలెక్టర్ సిద్ధార్థ శంకర్‌స్వైన్ తెలిపారు. రత్నభాండాగారం తెరవడంపై హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జసిటస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మంది సభ్యులతో ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్యానల్ జూలై 14న దీనిని తెరవాలని సిఫారసు చేసింది. ఇక్కడి భాండాగారానికి రక్షనగా పాము ఉందని కొంతమంది భావిస్తుంటారని, ఆ వదంతులను బలభద్రుని ప్రధాన సేవకుడైన హలధర్ దశమోహపాత్ర కొట్టిపారేశారు. ముందు జాగ్రత్త చర్యగా అధీకృత సిబ్బంది, పాములు పట్టే వ్యక్తి ఆలయంలోకి తీసుకెళ్లామని తెలిపారు.
46 ఏళ్ల తర్వాత ఓపెన్..
ఇదిలా ఉండగా పూరీ జగన్నాథుని రత్న భాండాగారం 46 ఏళ్ల తర్వాత తెరుచుకుంది. మొదట 1806లో ఆలయ రత్నభాండగారం తెరిచి అందులోని ఆభరణాలు లెక్కించారు. తర్వాత స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1950లో ఈ రత్నభాండాగారం తెరిచారు. ఆ సమయంలో కూడా ఆభరణాలను మళ్లీ లెక్కించారు. తర్వాత 1973లో మరోమారు రత్నభాండాగారం తెరిచారు. అయితే కొన్ని కారణాలతో ఆభరణాలను లెక్కించలేదు. ఎట్టకేలకు తిరిగి 46 ఏళ్ల తర్వాత మళ్లీ భాండాగారం తెరిచారు.
#WATCH | Puri, Odisha: Special boxes brought to Shri Jagannath Temple ahead of the re-opening of Ratna Bhandar.
The Ratna Bhandar of the Shri Jagannath Temple is to be opened today following Standard Operating Procedure issued by the state government. pic.twitter.com/xwRdtQe0Ml
— ANI (@ANI) July 14, 2024