https://oktelugu.com/

Vastu Tips : ఇంట్లో ఇది ఖాళీగా ఉంటే.. ధనం నిల్వదా? ఏం చేయాలంటే?

Vastu Tips బాత్రూంలో ఉన్న బకెట్ ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఇందులో ఎన్నో కొన్ని నీళ్లు ఉంచాలి. ఈ బకెట్ ఖాళీగా ఉండడం వల్ల డబ్బు నిల్వదు. అంతేకాకుండా లక్ష్మీ అనుగ్రహం ఉండదు.

Written By:
  • NARESH
  • , Updated On : July 3, 2024 / 05:01 PM IST
    Follow us on

    Vastu Tips : ప్రతి ఒక్కరూ ఆనందమైన జీవితం ఉండాలని కోరుకుంటారు. ఇల్లు సంతోషంగా ఉంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇల్లు సంతోషంగా ఉండాలంటే పరిశుభ్రంగా ఉంచడం మాత్రమే కాదు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను దిశ ప్రకారం ఉంచాలి. ఇల్లు నిర్మించేటప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారం దిశలను అమరుస్తారు. అలాగే ఇంట్లో ఉన్న వస్తువులను సైతం ఒక క్రమ పద్ధతిలో ఉంచాలి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మరో విషయాన్ని తప్పకుండా పాటించాలి. ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు ఖాళీగా ఉండడం వల్ల ధనం నిల్వదని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఆ వివరాల్లోకి వెళితే..

    వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు ఖాళీగా ఉండకూడదు. ఇలా ఉండడం వల్ల ఇంట్లోకి లక్ష్మీ రావడానికి సంకోచిస్తుందని అంటారు. ముఖ్యంగా ఆహరం వండే పాత్రలు అస్సలు ఏమీ లేకుండా ఉండకూడదట. మంగళవారం, శుక్రవారం అన్నం వండే పాత్రలో ఎంతో కొంత ఆహారాన్ని ఉంచాలని చెబుతుంటారు. ఒకవేళ ఎలాంటి ఆహారం లేకపోతే నీళ్లు పోసి అయినా ఉంచాలి.

    పురుషుల డబ్బులు దాచుకోవడానికి పర్సును మెయింటేన్ చేస్తుంటారు. ఈ పర్స్ ఎప్పుడూ ఖాళీగా ఉండకూదట. ఇందులో ఎంతో కొంత డబ్బులు ఉండే విధంగా చూసుకోవాలి. పర్సు ఖాళీగా ఉంటే ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటారు. పర్సులో డబ్బులు ఉండడం వల్ల అవి మరింత వృద్ది చెందుతాయిన వాస్తు శాస్త్రం చెబుతుంది.

    బాత్రూంలో ఉన్న బకెట్ ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఇందులో ఎన్నో కొన్ని నీళ్లు ఉంచాలి. ఈ బకెట్ ఖాళీగా ఉండడం వల్ల డబ్బు నిల్వదు. అంతేకాకుండా లక్ష్మీ అనుగ్రహం ఉండదు. ఎలాంటి అవసరం లేకపోయినా బాత్రూంలో బకెట్ లో నీళ్లు నింపి ఉంచాలి. వీటితో పాటు కొన్ని విలువైన వస్తువులను ఖాళీగా ఉంచకూడదు. వాటిని ఏదో విధంగా ఉపయోగిస్తూ ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతుంది.