Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జేష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కుంభరాశిలో బుధుడు, సూర్యుడు, చంద్రుడు కలిసి ప్రయాణం చేయనున్నారు. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు కీలక నిర్ణయం తీసుకునే సమయంలో పెద్దల సలహాలు తీసుకోవాలి. మెషంతో సహా మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారు ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఈ సమయంలో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. మాటల మాధుర్యం వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కరించబడతాయి. దీంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థుల భవిష్యత్తు గురించి కుటుంబంతో చర్చిస్తారు. వ్యాపారులు కీలకమైన ఒప్పందాలు చేసుకుంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారికి లాభాలు పొందుతారు. కుటుంబంలో ఏర్పడిన సమస్యలు తొలగిపోవడంతో సంతోషకరమైన జీవితం ఉంటుంది. పిల్లల భవిష్యత్తుపై కొంత పెట్టుబడులు పెట్టవచ్చు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఉద్యోగులు పదోన్నతులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సీనియర్ల మద్దతుతో లక్ష్యాలను పూర్తి చేస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వ్యాపారుల మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మద్దతుతో అధిక లాభాలు పొందుతారు. కొన్ని పనులు పూర్తి కావడంతో ఉత్సాహంతో ముందుకెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. దీంతో అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి ఉద్యోగులు తోటి వారి మద్దతుతో లక్ష్యాలు పూర్తి చేస్తారు. దీంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. అయితే ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తలు ఉండాలి. వ్యాపారులు కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడితే వారితో ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా జరపాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి ఉద్యోగులకు కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. అయితే వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్లాలి. వ్యాపారులకు సైతం శత్రువులు ఇబ్బందులకు గురి చేయడానికి ప్రయత్నిస్తారు. పెద్దల సలహాతో అనుకున్న పనులు పూర్తి చేయగలగాలి. పెయింటింగ్ సమస్యలు పరిష్కరించడంలో దృష్టి పెడతారు. మీరు చేసే పనుల్లో కొందరు జోక్యం చేసుకోవాలని చూస్తారు. అయితే ఎవరికి అవకాశం ఇవ్వకుండా చూడాలి. ఇతరులకు డబ్బు సహాయం చేస్తే వెంటనే తిరిగి తీసుకునే ప్రయత్నం చేయాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకోని అదృష్టం కలగనుంది. ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. జీవిత భాగస్వామి మద్దతుతో వ్యాపారులు లాభాలు పొందుతారు. అయితే ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. దుబారా ఖర్చులను నియంత్రించుకోవాలి. ఇతరులతో ఆర్థిక వ్యవహారాలు జరిపితే తీవ్రంగా నష్టపోతారు. ముఖ్యమైన పనులను ఇతరులకు అప్పగించకుండా ఉండాలి. ఉద్యోగులు సీనియర్లతో సంయవనం పాటించాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు చట్టపరమైన చిక్కులు ఎదుర్కొంటే నేటితో పరిష్కారం అవుతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. పెండింగ్ పనులను పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులు ఆర్థికంగా పుంజుకుంటారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం అందుతుంది. కొత్తగా ప్రాజెక్టు చేపడితే దీనిని వెంటనే పూర్తి చేస్తారు. అయితే ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తలు ఉండాలి. బ్యాంకు నుంచి రుణం తీసుకునే సమయంలో కీలక విషయాన్ని మర్చిపోవద్దు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వివాహానికి అడ్డంకులు ఏర్పడితే నేటితో సమసి పోతుంది. కొత్త వ్యక్తులతో వ్యాపారం చేయాలనుకుంటే పెద్దల సలహా తీసుకోవాలి. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యులకు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. పెద్దల సలహాతో కొత్త పెట్టుబడులను పెడతారు.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఆర్థిక వ్యవహారాలు జరిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొందరు లక్ష్యాలను పూర్తి చేయడంతో పదోన్నతులు పొందే అవకాశం ఉంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వ్యాపారాలు మిశ్రమ ఫలితాలు పొందుతారు. వివాహానికి సిద్ధమయ్యే వారికి ప్రతిపాదనలు వస్తాయి. కొత్తగా ఏ పని ప్రారంభించాలనుకున్న జీవిత భాగస్వామి సలహా అవసరం. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థుల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండడమే మంచిది. ఇంటికి పనులను పూర్తి చేయడంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : కీలకమైన నిర్ణయాన్ని తీసుకునే సమయంలో పెద్దల సలహా తీసుకోవాలి. వ్యాపారులకు కొందరు అడ్డంకులు సృష్టించవచ్చు. పెద్దల సలహాతో వీరి నుంచి బయటపడతారు. అయితే ఆర్థిక వ్యవహారాలు జరిపే సమయంలో కొత్త వ్యక్తులను నమ్మొద్దు. రహస్యాలను ఇతరులకు చెప్పకుండా ఉండాలి. జీవిత భాగస్వామితో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఇతరుల సలహా తీసుకోవాలి. విద్యార్థుల కోసం కొత్తగా పెట్టుబడులు పెడతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం పొందేందుకు మార్గం ఏర్పడుతుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అయితే వాహనాలపై ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. పెండింగ్ పనులను పూర్తి చేయడానికి కృషి చేస్తారు.