Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశరాసులపై హస్త నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు శుక్రుడు కలయికతో సమా సప్తక యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు పొందుతారు. మరికొన్ని రాశుల వారు ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారు ఈ రోజు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటారు. అయితే దీనిని తిరిగి చెల్లించేందుకు ప్రణాళికలు రచించాలి. లేకుంటే ఆర్థిక భారం ఎక్కువ అవుతుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో భవిష్యత్తు గురించి చర్చిస్తారు. వ్యాపారులకు లాభాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకుంటారు. ఈ నిర్ణయంతో వారి జీవితంలో అనేక మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) ఈ రాశి వారు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. అయితే కొన్ని పూర్తి కావడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఉంటుంది. వీరి నుంచి తప్పించుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని ఆలోచించే వారు పెద్దల సలహా తీసుకోవాలి. వ్యాపారులకు అనుకున్న లాభాలు రావడంతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు సీనియర్ల నుంచి మద్దతు ఉంటుంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఇతరులతో ఆర్థిక వ్యవహారాలు జరిపినట్లైతే జాగ్రత్తగా ఉండాలి. కొందరు మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని డబ్బులు ఆదా చేయాలి. అనవసరపు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయడంతో ఉల్లాసంగా ఉంటారు. మీరు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : బంధువులలో ఒకరి నుంచి ధన సహాయం పొందుతారు. కొన్ని పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడం వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించాలి. ఏ చిన్న అనారోగ్యం కలిగిన వైద్యుడుని సంప్రదించాలి. ఆదాయాన్ని బట్టి ఖర్చులు చేయాలి. లేకుంటే ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు తల్లిదండ్రులు సలహా తీసుకోవాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. అయితే అనుకున్న పనులు పూర్తి కావడంతో కాస్త నిరాశతో ఉంటారు. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండటమే మంచిది. ఇవి లాభాల కంటే ఎక్కువ నష్టాలే తీసుకొస్తాయి. స్నేహితుల్లో ఒకరు ఆర్థిక సహాయం చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. వ్యాపారులకు సాధారణ లాభాలు ఉంటాయి. ఉద్యోగులు మిశ్రమ ఫలితాలు పొందుతారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : కార్యాలయాల్లో ఉద్యోగులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. అయితే వీరికి కొందరు సహాయం చేస్తారు. దీంతో లక్ష్యాలను పూర్తి చేయగలుగుతారు. జీవిత భాగస్వామితో ఏదైనా వివాదం ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. ఇది కొనసాగితే బంధాలు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో గౌరవం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తారు. అయితే కొన్ని పనుల వల్ల ప్రజల మద్దతులో కూడ కడతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : భవిష్యత్తులో జరిగే శుభకార్యాల గురించి ఈ రాశి వారు ఈరోజు చర్చిస్తారు. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడంలో తీవ్రంగా ఆలోచిస్తారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక సంబంధించిన వివాదం ఉంటే నేటితో పరిష్కారం అవుతుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావడంతో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఏ రోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల్లో ఒకరు ఇబ్బందులకు గురవుతారు. దీంతో మానసికంగా ఆందోళనగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. అయితే వీటిని అధిగమించి లక్ష్యాలను పూర్తి చేస్తారు. బంధువుల్లో ఎవరికైనా డబ్బు అవసరం పడితే సాయం చేస్తారు. పాత స్నేహితులను కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఎంతో సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అయితే కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి. వ్యాపారులు లాభాలు పొందడంతో ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం గానే ఉంటుంది. అయితే అదనపు ఆదాయం కోసం మార్గాలు వెతుకుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు పెండింగ్ పలను సకాలంలో పూర్తి చేస్తారు. పిల్లల కెరీర్ పై దృష్టి పెట్టి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెడతారు. బంధువుల నుంచి గౌరవం లభించడంతో వారితో సంతోషంగా ఉంటారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే వారికి ఈరోజు అనుకూల సమయం. జీవిత భాగస్వామితో ఇప్పటికే వ్యాపారం చేసేవారు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. కొన్ని పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయిస్తారు. పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. అయితే కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం ఏర్పడితే నిర్లక్ష్యంగా ఉండద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. పెద్దల సలహాలతో కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. జీవిత భాగస్వామితో వివాదం ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు ఉల్లాసంగా ఉంటారు. అర్హులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొందరి ఇళ్లల్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. సమాజంలో గౌరవం పెరగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. సంతోషకరమైన జీవితంతో గడుపుతారు. కుటుంబ సభ్యులకు వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. కొత్త వ్యక్తులతో వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు కాస్త ఆలోచించాలి.