Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 తుదిశ్వాస విడిచారు. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి స్కాట్ లాండ్ లోని బల్మొరల్, క్యాజిల్ లో ఆమె కన్నుమూశారు. బ్రిటన్ కు ఏకంగా డెబ్బయి ఏళ్ల పాటు రాణిగా కొనసాగడం గమనార్హం. ఆమె తన ఇరవై ఐదో ఏట నుంచి బ్రిటన్ మహారాణిగా బాధ్యతలు చేపట్టి ఎక్కువ కాలం రాణిగా ఉన్నారు. అత్యధిక కాలం రాణిగా వ్యవహరించి చరిత్ర సృష్టించారు. ఆమె తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుని ప్రజలకు చేరువయ్యారు. ఎలిజబెత్ మే ఫెయిర్ లండన్ లో డ్యాక్, డచెస్ ఆఫ్ యార్క్ కు మొదటి సంతానంగా జన్మించింది.
ఎలిజబెత్ తల్లిదండ్రులు 17 బ్రూటన స్ట్రీట్ లో ఉండేవారు. ప్రస్తుతం అక్కడ ఓ రెస్టారెంట్ ఉంది. ఎలిజబెత్ తన పుట్టిన రోజును ఏడాదికి రెండు రోజులు జరుపుకునేవారు. నిజమైన పుట్టిన రోజు ఏప్రిల్ 21 కాగా అధికారిక పుట్టిన రోజును జూన్ నెలలో రెండో శనివారం జరుపుకోవడం విశేషం. తన 21వ ఏట పుట్టిన రోజునే తన జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేస్తానని మాట ఇచ్చింది. ఎలిజబెత్ 1952 నుంచి రాణిగా వ్యవహరిస్తున్నారు. ప్రతి మంగళవారం ప్రధానమంత్రి రాజ కుటుంబం అధినేతతో సమావేశం కావడం పరిస్థితుల గురించి చర్చించడం ఆనవాయితీగా వస్తోంది.
పరిపాలన వ్యవహారాలన్ని రాణి పేరు మీదే జరగడంతో ఆమె ఎక్కడికి వెళ్లాలన్నా పాస్ పోర్టు, వీసా అక్కరలేదు. దీంతో ఆమె ఏ దేశానికి వెళ్లినా ఆమెను వీసా అడగరు. పాస్ పోర్టు చూడరు. దేశంలో కూడా ఆమె ఎక్కడకు వెళ్లినా డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు. బ్రిటన్ లోని పాస్ పోర్టులు రాణి పేరు మీదే జారీ చేయబడతాయి. అందుకే ఆమెకు వీసా, పాస్ పోర్టు అవసరం లేకుండా ప్రపంచంలో ఏ దేశమైనా చుట్టి వచ్చే వీలుండటం గమనార్హం. ఎలిజబెత్ సుదీర్ఘ కాలం బ్రిటన్ రాణిగా కొనసాగి తనకు ఎదురు లేదని అనిపించుకుంది.
ఎలిజబెత్ 14 మంది ప్రధానమంత్రులతో పనిచేసింది. అంటే ఆమె హయాంలో అంతమందితో కలిసి పనిచేయంతో ఆమె తన పదవీకాలంలో ఎన్నో విషయాలు దగ్గరుండి చూసినట్లు సమాచారం. రాణికి జంతువులంటే అమితమైన ప్రేమ. ఎక్కువ కాలం వాటితోనే గడపడం వారికి సరదా. 2018లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూకే పర్యటనలో రాణి ఎలిజబెత్ తో లండన్ లోని బకింగ్ హామ్ ప్యాలెస్ లో సమావేశమయ్యారు. పలు విషయాలపై చర్చించారు. రాణి ఎలిజబెత్ మరణం ఆ దేశ వాసుల్ని తీవ్రంగా కలచివేసింది.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Some facts you dont know about queen elizabeth anywhere in the world without a passport or visa
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com