YS Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మరొక యాత్రకు శ్రీకారం చుట్టారు. షర్మిల పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి ఈ రోజు నుండి రైతు ఆవేదన యాత్ర ప్రారంభిస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం వారి ధాన్యం సేకరణ అంశం పైన తెలంగాణ రాష్ట్రము వర్సెస్ కేంద్రం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఇదే సమయంలో ధరల అంశం పైన కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేస్తున్నారు.
షర్మిల చేపట్టిన రైతు ఆవేదన అయిదు రోజుల యాత్రలో హైదరాబాద్ నుండి లోటస్ పాండ్ లోని తన పార్టీ కార్యాలయంలో యాత్రను ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో షర్మిల ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ యాత్రను చేపడుతున్నారు. ఈ యాత్ర డేకాంబర్ 23 వరకు కొనసాగుతుంది. ఈ యాత్రలో భాగంగా షర్మిల ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్సించ నున్నారు.
Also Read: భాగ్యనగరంలో ఎల్లో ఎలెర్ట్.. రానున్న నాలుగు రోజుల్లో చలి మరింత పెరిగే ఛాన్స్..
ఆ రైతు కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున సాయం అందజేస్తున్నారు. ఈ రోజు స్టార్ట్ అయినా ఈ యాత్ర గచ్చిబౌలి నుండి నర్సాపూర్ మీదుగా మెదక్ జిల్లా లోని కాంచన పల్లికి చేరుకుంటుంది. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతులను షర్మిల పరామర్సించ బోతుంది. రెండవ రోజు నిజామాబాద్, లింగం పేట, నాగిరెడ్డి పేట, మూడవ రోజు క్రీం నగర్ జిల్లా, నాలుగవ రోజు ఆదిలాబాద్, ఐదవ రోజు అన్నోజిగూడ లో ఈ యాత్రను షర్మిల ముగిస్తుంది. ఇక క్రిస్మస్ వేడుకలకు షర్మిల ఈ సారి పులివెందులకు వెళ్తున్నారా లేదా అనే అంశం పైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
షర్మిల పులివెందుల లోనే క్రిమస్ వేడుకలను జరుపుకుంటారా లేదంటే ఇక్కడే జరుపుకుంటారా అనే చర్చ సాగుతుంది. తెలంగాణ పార్టీ భవిష్యత్తు పైన చర్చ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత తిరిగి షర్మిల తన పాదయాత్ర కొనసాగుతుందని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు జనవరి తొలివారంలో షర్మిల పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తారని తెలుస్తుంది. ప్రెసెంట్ షర్మిల పులివెందుల పర్యటన మీద ఆసక్తి నెలకుంది.
Also Read: కేంద్రంపై ఇలా ఫైట్ మొదలెట్టిన కేటీఆర్
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Sharmila start raithu avedana yathra
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com