Puri Liger OTT deal: ఒకపక్క ఆర్థిక కష్టాలు చుట్టుముట్టినా పూరి లైగర్ ఓటీటీ డీల్ ఎందుకు వదులుకున్నారు?

Puri Liger OTT deal: విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ మూవీపై భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ కోసం ఆడియన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 25న వరల్డ్ వైడ్ మూవీ విడుదల కానుంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. విడుదలకు రెండు రోజుల ముందు వరకు కూడా టీం పర్యటనలు చేయనుంది. విజయ్ దేవరకొండ వెళ్లిన ప్రతి […]

Written By: Shiva, Updated On : August 18, 2022 12:52 pm
Follow us on

Puri Liger OTT deal: విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ మూవీపై భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ కోసం ఆడియన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 25న వరల్డ్ వైడ్ మూవీ విడుదల కానుంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. విడుదలకు రెండు రోజుల ముందు వరకు కూడా టీం పర్యటనలు చేయనుంది. విజయ్ దేవరకొండ వెళ్లిన ప్రతి నగరంలో ఊహించని రెస్పాన్స్ దక్కుతుంది. నార్త్ ఇండియా యూత్ సైతం విజయ్ దేవరకొండను చూసేందుకు ఎగబడటం విశేషం.

Puri Liger OTT deal

Also Read: Anchor Vishnupriya: ఏకంగా రెండు సార్లు.. ఫస్ట్ నైట్ గురించి బాంబు పేల్చిన విష్ణుప్రియ.. మరీ ఇంత పచ్చిగానా?

సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలంటే విభిన్నమైన ప్రమోషనల్ టెక్నీక్స్ అవసరం. లైగర్ టీమ్ ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళుతుంది. దీనిలో భాగంగా విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ లను లైగర్ నిర్మాత ఛార్మి ఇంటర్వ్యూ చేశారు. ప్రేక్షకుల కోణంలో వాళ్ళ సందేహాలు, అంచనాలు వారిద్దరి ముందు ఉంచారు. ఈ క్రమంలో లైగర్ నిర్మాణంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులను ఛార్మి తలచుకున్నారు.

puri jagannath – vijay devarakonda

అనుకున్న దానికంటే బడ్జెట్ పెరిగిపోయింది. ఒకవేళ సినిమా ఫెయిల్ అయితే… ప్రేక్షకులు రాకపోతే పరిస్థితి ఏంటని? విజయ్, పూరీలను అడిగారు. ఈ సందర్భంగా ఛార్మి లైగర్ సినిమాకు వచ్చిన భారీ ఓటీటీ డీల్ గురించి బయటపెట్టారు. లాక్ డౌన్ సమయంలో చేతిలో ఒక్క రూపాయి లేదు. ఆ సమయంలో భారీ ఓటీటీ ఆఫర్ లైగర్ చిత్రానికి వచ్చింది. దాన్ని రిజెక్ట్ చేయాలంటే గట్స్ ఉండాలి. ఆ ఆఫర్ ఎందుకు రిజెక్ట్ చేశారని ఛార్మి అడగడం జరిగింది. ఈ ప్రశ్న అడుగుతూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

Also Read: Bollywood downfall : లాల్‌ సింగ్‌ చడ్డా, రక్షా బంధన్ ప్లాప్? ఆవిరైన బాలీవుడ్ ఆశలు.. అసలు లోపం ఎక్కడ?

దానికి పూరి… నీ కష్టాలు నాకు తెలుసు. ఎన్నో సార్లు ఏడ్చావు… అంటూ నిర్మాతగా ఛార్మి పడ్డ ఇబ్బందులు గుర్తు చేశాడు. రెండు విషయాలు పూరిని నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చాయని ఛార్మి చెప్పారు. ఇది ప్రోమో కావడంతో ఛార్మి ప్రశ్నలకు పూరి, విజయ్ సమాధానాలు తెలియలేదు. పూర్తి ఇంటర్వ్యూ ఆగస్టు 19న విడుదల కానుంది. ఇక లైగర్ చిత్రానికి కరణ్ జోహార్ మరో నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలక రోల్స్ చేస్తున్నారు.