https://oktelugu.com/

Varun Tej with the Heroine: వరుణ్ తేజ్ నాటీ.. ఆ హీరోయిన్ తో ఇలా సీక్రెట్ గా దొరికేశాడు..!

Varun Tej with the Heroine: మెగా హీరో వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో జోడీగా నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయిందని చెబుతున్నారు. ఆ సినిమాల్లో నటనకు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారట. భవిష్యత్ తో వీరిద్దరు లవర్స్ అవుతారని ఆనాడే చెప్పారట. అంతగా ఆ సినిమాల్లో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 18, 2022 / 05:00 PM IST

    Varun Tej

    Follow us on

    Varun Tej with the Heroine: మెగా హీరో వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో జోడీగా నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయిందని చెబుతున్నారు. ఆ సినిమాల్లో నటనకు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారట. భవిష్యత్ తో వీరిద్దరు లవర్స్ అవుతారని ఆనాడే చెప్పారట. అంతగా ఆ సినిమాల్లో వీరి మధ్య లవ్ సీన్లు ఉన్నాయని తెలుస్తోంది.

    varun Tej

    Also Read: Megastar Chiranjeevi: ఫిల్మ్ నగర్ లో విలువైన ఆస్తులను అమ్మేసుకున్న మెగాస్టార్ చిరంజీవి..షాక్ లో ఫాన్స్

    వరుణ్ తేజ్ ఇటీవల నటించిన గని సినిమా విడుదలైనా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో కొన్ని రోజులుగా వరుణ్ తేజ్ బయట కనిపించడం లేదు. జనవరి 19న వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా లావణ్యకు డైమండ్ రింగ్ కొనిచ్చినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వీరిద్దరు ఓ స్నేహితుడి బర్త్ డేకు కలిసి హాజరైనట్లు తెలుస్తోంది. దీంతో వీరి కలయికపై మరోమారు వార్తలు గుప్పుమన్నాయి. ఇద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతున్నందున అందరు వారిని వింతగా చూశారు. వీరు అడ్డంగా దొరకడంతో అందరు ఆశ్చర్యంగా చూశారు.

    Lavanya Tripathi

    Also Read: Sita Ramam: ‘సీతారామం’ సినిమాని మన టాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హీరోలు వదులుకున్నారో తెలుసా

    మరోవైపు వరుణ్ తేజ్ సోదరి నిహారిక పెళ్లికి లావణ్య హాజరైంది. రాజస్తాన్ తో తక్కువ మంది ఆహుతులతో జరిగిన వివాహ మహోత్సవానికి లావణ్య రావడంతో అందరిలో ఆశ్చర్యం కలిగింది. వీరి మధ్య ఉన్న ప్రేమతోనే అంత దూరం వెళ్లి పెళ్లికి హాజరైందని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో వీరి ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తెలుగు చిత్ర సీమలో ప్రేమాయణాలు కొత్తేమీ కాదు. ఇదివరకే ఎంతో మంది పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. వారి బాటలో వరుణ్ తేజ్, లావణ్య కూడా చేరనున్నారు.

    Varun Tej Family

    ASlso Read: OTT: భయమే ఓటీటీకి ఆదాయ వనరు

    వరుణ్ తేజ్ తల్లి మాత్రం తనకు ఎవరు కోడలుగా వచ్చినా అభ్యంతరం లేదని చెప్పడంతో వీరి వివాహానికి ఇక ఏ అడ్డు లేదని తెలుస్తోంది. వరుణ్ తేజ్ తన ప్రేమను లావణ్యతో పంచుకోవడంతో వారి పెళ్లి ఖాయమేనా? అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల ప్రేమ పెళ్లిపీటలు ఎక్కుతుందా అనేది సందేహమే. దీంతో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల ప్రేమ కథ సుఖాంతమవుతుందా? లేక మధ్యలోనే అవరోధాలు వస్తాయా? అనేది తేలాల్సి ఉంది.
    Recommended Videos