
కేంద్ర సాయుధ బలగాల్లో బీఎస్ఎఫ్, సీఆర్ పీఎఫ్ వంటి వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో దాదాపు లక్షకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో చాలా వరకు పదవీ విరమణ , మరణాలు , రాజీనామాల వల్ల ఏర్పడ్డ ఖాళీలేనని తెలిపింది. ఈ మేరకు సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అత్యధికంగా బీఎస్ఎప్ లో 28,926 ఖాళీలు ఉన్నాయన్నారు. సీఆర్పీఎప్ లో 26,506, సీఐఎస్ఎఫ్ లో 23,906, ఎస్ఎస్బీలో 18,643,ఐటీబీపీలో 5,784, అస్సాం రైఫిల్స్ లో 7,328 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. వీటిలో చాలా వరకు కాని స్టేబుల్ స్థాయి పోస్టులేనన్నారు. నిర్ధారిత ప్రక్రియ ద్వారానే వీటిని భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు.
Also Read : ఓపెన్ నాలాలపై క్యాపింగ్ నిర్మాణం- కేటిఆర్